Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Kia New Car: దక్షిణ కొరియాకు చెందిన కార్ల బ్రాండ్ కియా తన కొత్త కారును మనదేశంలో లాంచ్ చేసింది. అదే కియా సీరోస్. ఈ కారు కోసం ఆటో లవర్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
Kia Syros Launched in India: కియా మోటార్స్ ఎట్టకేలకు భారతదేశంలో అత్యంత ఎదురుచూస్తున్న 7 సీటర్ సీరోస్‌ను విడుదల చేసింది. ఇది సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ. ఇది సోనెట్ కంటే కొంచెం పెద్దది కానీ సెల్టోస్ కంటే ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంది. కియా సీరోస్ డెలివరీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుంది. అయితే దీని ధరలు 2025 జనవరిలో వెల్లడించారు.
కియా సీరోస్ డిజైన్, ఫీచర్లు
కియా సీరోస్ భారతదేశంలో ఐదో ఎస్‌యూవీ. దీని డిజైన్ చాలా భిన్నమైనది, ప్రీమియం తరహాలో ఉంటుంది. ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో డ్యూయల్ స్క్రీన్ సెటప్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి అనేక గొప్ప ఫీచర్లు ఉన్నాయి. సీరోస్ పొడవు 3,995 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 1,800 మిల్లీమీటర్లు గానూ, ఎత్తు 1,665 మిల్లీమీటర్లుగానూ ఉంది. దీని వీల్‌బేస్ గురించి మాట్లాడినట్లయితే అది 2,550 మిల్లీమీటర్లుగా ఉండనుంది.
Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
ఇంజిన్, కలర్ ఆప్షన్లు ఇలా...
కియా సీరోస్ పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడితే ఇందులో 1.0 టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్, 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కలిగి ఉంది. కలర్ ఆప్షన్ల గురించి చెప్పాలంటే మీరు ఫ్రాస్ట్ బ్లూ, ప్యూటర్ ఆలివ్, అరోరా బ్లాక్ పెర్ల్, ఇంటెన్స్ రెడ్, గ్రావిటీ గ్రే, ఇంపీరియల్ బ్లూ, స్పార్క్లింగ్ సిల్వర్, గ్లేసియర్ వైట్ పెర్ల్ రంగులను పొందుతారు.
కారు లోపలి భాగం గురించి చెప్పాలంటే ఇది వెంటిలేటెడ్ సీట్లతో చాలా మంచి బూట్ స్పేస్‌ను పొందనుంది. గేర్ షిఫ్టర్ తరహాలో ఉండే ఎయిర్‌క్రాఫ్ట్ థ్రోటుల్, 360 డిగ్రీ కెమెరా పార్కింగ్ అందించారు. వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా మల్టీ టైప్-సీ యూఎస్‌బీ పోర్ట్‌లతో కారులో అందుబాటులో ఉంది. ఈ 7 సీటర్ కియా కారులో మీకు పనోరమిక్ సన్‌రూఫ్ అందించనున్నారు.
మిగతా ఫీచర్లు ఇలా...
సీరోస్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 17 అంగుళాల వీల్స్‌తో పాటు టాప్ ఎండ్ ట్రిమ్‌తో పాటు ఎల్ ఆకారపు టెయిల్ ల్యాంప్‌లను కూడా పొందుతుంది. కారు ఇతర ఫీచర్ల గురించి మాట్లాడితే ఇది ఏడీఏఎస్ లెవల్ 2, రిక్లైనింగ్ రిక్లైనింగ్ సీట్లు, 8 స్పీకర్ ఆడియో సిస్టమ్, పవర్డ్ హ్యాండ్‌బ్రేక్‌లను పొందుతుంది. దీని ధర వివరాలు 2025 జనవరి 3వ తేదీన బయటకి రానున్నాయి.
Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Across the cosmic ocean, it is here to make a wish come true.
— Kia India (@KiaInd) December 19, 2024
Presenting the new Kia Syros. The future of SUVs.
Bookings open on 3rd January'25.#Kia #KiaIndia #TheKiaSyros #Syros #EvolvedByTheFuture #ANewSpeciesOfSUV #Technology #TheNextFromKia #MovementThatInspires