మారుతి గ్రాండ్ విటారా ఎంత మైలేజీని ఇస్తుంది? మారుతి కార్లు మంచి మైలేజీని ఇస్తాయని మార్కెట్లో మంచి పేరుంది. ఈ కంపెనీకి సంబంధించిన కార్లు 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇస్తాయి. మంచి మైలేజీని ఇచ్చే కార్ల లిస్ట్‌లో మారుతి గ్రాండ్ విటారా పేరు కూడా కచ్చితంగా ఉంటుంది. మారుతి గ్రాండ్ విటారా అనేది స్మార్ట్ హైబ్రిడ్ కారు. మారుతి గ్రాండ్ విటారా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌పై 21.11 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అదే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌పై 20.58 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ఎలక్ట్రిక్ హైబ్రిడ్ మోడల్ ఏకంగా 27.97 కిలోమీటర్ల మైలేజీని డెలివర్ చేస్తుంది. ఇందులో సీఎన్‌జీ వెర్షన్ 26.6 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.10.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది.