కారులో గేర్లను ఎప్పుడెప్పుడు మార్చాలి? - అసలు దాని టెక్నిక్ ఏంటి? కారును పర్‌ఫెక్ట్‌గా డ్రైవ్ చేయాలంటే గేర్‌పై కమాండ్ కచ్చితంగా ఉండాలి. కారు వేగాన్ని పెంచడానికి, తగ్గించడానికి గేర్లు ఉపయోగపడతాయి. కారు డ్రైవ్ చేసే ముందు గేర్లతో పాటు స్టీరింగ్, క్లచ్‌పై కూడా అవగాహన ఉండాలి. కారుకు ఉన్న బేసిక్ రూల్ ఏంటంటే కారు వేగాన్ని పెంచాలంటే గేర్లను కూడా పెంచాలి. అలాగే ఇంజిన్ నుంచి ఎక్కువ పవర్ జనరేట్ చేయాలంటే గేర్లను తగ్గించాల్సి ఉంటుంది. ఫస్ట్ గేర్‌లో కారుకు పుల్లింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. కానీ కారు స్పీడ్ తక్కువ ఉంటుంది. ఐదో గేర్‌లో డ్రైవింగ్ చేసేటప్పుడు కారుకు అవసరమైన పవర్ తక్కువే కానీ కారు హై స్పీడ్‌లో దూసుకుపోతుంది. గేరును మార్చేటప్పుడు ముందుగా బ్రేక్ వేసి అప్పుడు మార్చాలి. కారు వేగం పెరిగే కొద్దీ గేర్లు పెంచుకోవాలి. కారును తక్కువ స్పీడ్‌లో నడిపేటప్పుడు ఫుట్ బ్రేక్ వాడాలి. యాక్సెలరేటర్ ఎక్కువగా తొక్కాల్సి వచ్చినప్పుడు తక్కువ గేర్‌లో వెళ్లాలి.