అన్వేషించండి

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !

Allu Arjun: చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు.

Chikkadapally police has issued a notice to Allu Arjun:  అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులు సోమవారం సాయంత్రం ఆయనకు చేరాయి. సంధ్యా ధియేటర్‌లో తొక్కిసాలట ఘటనపై నమోదైన కేసులో ఆయనను ప్రశ్నించనున్నారు. 

సంధ్యా ధియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసుల విచారణ              

పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజున అల్లు అర్జున్ సంధ్యా ధియేటర్ లో సినిమా చూసేందుకు వెళ్లారు. ఆ రోజున తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు తొక్కిసలాట కారణంగా కోమాలోకి వెళ్లిపోయాడు. ఇప్పటికీ కోమాలో ఉన్నాడు. ఈ ఘటనలో అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయడంతో అదే రోజు బెయిల్ వచ్చింది. అయితే ఒక రోజు జైల్లో ఉండాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఈ ఇష్యూ రాజకీయంగానూ మారింది.  అల్లు అర్జున్ తరపు లాయర్లతో పాటు అల్లు అర్జున్ కూడా పూర్తిగా పోలీసుల తప్పు వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపిస్తున్నారు.  అందుకే పోలీస్ కమిషనరే ఏకంగా ఆధారాలు బయట పెట్టారు.  

పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్న వైనం                

అల్లు అర్జున్ ఆరోపణల తర్వాత పోలీసులు ఈ కేసును మరింత సీరియస్ గా తీసుకున్నారు. ప్రెస్మీట్ లో అర్జున్ మాట్లాడటం కూడా తప్పేనని..  బెయిల్ పై ఉన్న వ్యక్తి ఇలా కేసు గురించి మాట్లాడకూడదని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన పెట్టిన ప్రెస్ మీట్ వివాదాస్పదం అయింది. పోలీసులు వెంటనే నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ ఇప్పుడు విచారణకు హాజరవుతారా లేకపోతే మరోసారి కోర్టుకు వెళ్తారా అన్నది చూడాల్సి ఉంది. అర్జున్ కేసు విషయంలో ఓ పెద్ద లీగల్ టీం పని చేస్తోంది. ఆ లీగల్ టీం ఇచ్చిన సలహాల మేరకే అర్జున్ మాట్లాడుతున్నట్లుగా చెబుతున్నారు.           

లీగల్ టీమ్‌తో అల్లు అర్జున్ సంప్రదింపులు                  

కోర్టుకు వెళ్లే ఉద్దేశం లేకపోతే ఉదయమే అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఒక వేళ తనకు కుదరకపోతే ఆయన మరింత సమయం కావాలని కోరే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కేసు  రాను రాను సున్నితంగా మారుతున్నందున .. మీడియా ఎదుట కూడా మాట్లాడినందున విచారణకు వెళ్లడమే మంచిదని ఆయన క్యాంప్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.  పోలీసుల ముందు హాజరైనా అర్జున్ కు అరెస్టు ముప్పు లేదు. ప్రశ్నించి పంపించేస్తారు. ఇదే కేసులో నాలుగు వారాల మధ్యంతబెయిల్ హైకోర్టు ఇచ్చింది.   అప్పటి వరకూ పోలీసులు అరెస్టు చేయరు. అయితే విచారణకు హాజరు కాకుండా ఉంటే.. విచారణకు సహకరించడం లేదని దిగువకోర్టులో పోలీసులు వాదించే అవకాశం ఉంటుంది. అలాంటి చాన్స్ ఇవ్వకుండా పోలీసుల ఎదుట హాజరవుతారని అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Hrithik Roshan : హృతిక్ రోషన్‌తో టాలీవుడ్ డైరెక్టర్? - కాంతార మేకర్స్ ప్రాజెక్టుపై క్రేజీ బజ్
హృతిక్ రోషన్‌తో టాలీవుడ్ డైరెక్టర్? - కాంతార మేకర్స్ ప్రాజెక్టుపై క్రేజీ బజ్
Venky Anil 5 : అనిల్ రావిపూడి కొత్త మూవీ రీమేక్ - ఒక్క పోస్ట్‌తో చెక్ పెట్టేసిన కీర్తి సురేశ్
అనిల్ రావిపూడి కొత్త మూవీ రీమేక్ - ఒక్క పోస్ట్‌తో చెక్ పెట్టేసిన కీర్తి సురేశ్
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
Bandla Ganesh : అన్యాయం జరిగింది... సుప్రీంకోర్టుకు వెళ్తా - ఆస్తి వివాదంపై బండ్ల గణేష్ ట్వీట్... అసలేం జరిగిందంటే?
అన్యాయం జరిగింది... సుప్రీంకోర్టుకు వెళ్తా - ఆస్తి వివాదంపై బండ్ల గణేష్ ట్వీట్... అసలేం జరిగిందంటే?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget