Sobhita Dhulipala: చైతన్య, శోభిత మీదే అందరి కళ్లు... ఆల్రెడీ అక్కినేని కోడలు హోదా, అదీ పెళ్ళికి ముందు!
ఏయన్నార్ అవార్డు వేడుకలో అక్కినేని కుటుంబం, మెగాస్టార్ చిరంజీవితో పాటు అందరి దృష్టిని ఆకర్షించిన మరొక సెలబ్రిటీ శోభితా ధూళిపాళ. అందరి కళ్ళు ఆవిడతో పాటు చైతన్య మీద ఉన్నాయి.

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు (Akkineni Nageswara Rao) పేరు మీద ఆయన కుటుంబం ప్రతి ఏడాది ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు (ANR National Award 2024)ను ఇస్తుంది. ఆయన శత జయంతి సందర్భంగా ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ వేడుకలో మోహన్ బాబు లెజెండరీ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావించారు చిరు. ఇంకా అక్కినేని మీద తన తల్లికి ఉన్న అభిమానాన్ని తెలిపారు. అయితే... వీటన్నిటి మధ్య శోభిత ధూళిపాళ హైలైట్ అయ్యారు అందరి కళ్ళు ఆవిడతో పాటు అక్కినేని నాగ చైతన్య మీద పడ్డాయి.
చైతన్యతో పెళ్లికి ముందు అక్కినేని కోడలు హోదా!
అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya)తో శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) త్వరలో ఏడు అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల పెళ్లి పనులు కూడా మొదలు పెట్టారు. పసుపు దంచుడు కార్యక్రమం చేశారు. పెళ్లికి ఇంకా సమయం ఉంది. అయితే... ఆల్రెడీ ఆమెకు అక్కినేని కోడలు హోదా ఇచ్చేసింది కుటుంబం.
హైదరాబాద్ సిటీలో ఆదివారం నిర్వహించిన ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు వేడుకలో పురస్కార గ్రహీత చిరంజీవితో పాటు అక్కినేని కుటుంబం అంతా కలిసి ఫోటో దిగింది. ఆ ఫోటోలో శోభితా ధూళిపాళకు సైతం చోటు కల్పించింది అక్కినేని ఫ్యామిలీ. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే దిగే ఫోటోకు ఆమెను పిలవడం ద్వారా శోభిత తమ కుటుంబ సభ్యురాలు అని పరోక్షంగా అక్కినేని ఫ్యామిలీ చెప్పింది.
నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి అయినట్టే అని మన పెద్దలు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆ మిగతా సగం పెళ్లి తంతు త్వరలో పూర్తి కానుంది. అందుకే కాబోయే ఈ కొత్త జంట మీద... ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు వేడుకలో శోభిత ధూళిపాళ్ల, నాగ చైతన్య జోడి మీద అందరి కళ్ళు పడ్డాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
Also Read: చిరంజీవికి ఏయన్నార్ అవార్డు... మోహన్ బాబు 'లెజెండరీ' వివాదానికి ఫుల్ స్టాప్ పడేనా?
దర్శ కేంద్రుడు కే రాఘవేంద్ర రావు నుంచి మొదలు పెడితే అగ్ర నిర్మాతలు అశ్విని దత్ అల్లు అరవింద్ వరకు... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి మొదలు పెడితే యువ హీరోలు నాని, సిద్దు జొన్నలగడ్డ వరకు... హీరోయిన్లు రమ్యకృష్ణ, శ్రీ లీల నుంచి మొదలు పెడితే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం వరకు... పలువురు ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. వారందరిని శోభిత ధూళిపాళ సాదరంగా స్వాగతించారు. అక్కినేని కుటుంబంతో కలిసి అతిథులకు ఆహ్వానం పలికారు. ఈ వేడుక ద్వారా శోభిత తమ ఇంటి కోడలు అని అక్కినేని కుటుంబం అందరికీ స్పష్టత ఇచ్చినట్లు అయ్యింది.
Also Read: మెగాస్టార్ చిరంజీవికి ఏయన్నార్ నేషనల్ అవార్డు - సందడి చేసిన స్టార్స్ ఎవరో చూశారా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

