అన్వేషించండి

Revanth Chitchat: 3 అనుమానాస్పద మరణాలకు కేటీఆర్‌కు లింకేంటి ? - ఢిల్లీలో సీఎం రేవంత్ చిట్ చాట్

Telangana: ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో రేవంత్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇందులో మూడు అనుమానాస్పద మరణాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Telangana CM Revanth Reddy: తెలంగాణలో మూడు అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయని రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో చెప్పారు. ఒకరు మేడిగడ్డపై కేసులు వేసిన రాజలింగమూర్తి, రెండు సినీ నిర్మాత కేదార్, మూడు వీరిద్దరి కేసులను వాదిస్తున్న సంజీవరెడ్డి అనే లాయర్ అని చెప్పారు. సినీ నిర్మాత కేదార్ కేటీఆర్ బిజినెస్ పార్టనర్ అన్నారు. ఈ మరణాలపై కేటీఆర్ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. కేదార్ అనే సినీ నిర్మాత విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండతో  గం గం గణేశా అనే సినిమా తీశారు. విజయ్ దేవరకొండతో ఓ సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఓ సినీ పైనాన్షియర్ ఇంట్లో పెళ్లి వేడుకల కోసం దుబాయ్ వెళ్లిన ఆయన అక్కడ చనిపోయారు. ఏం జరిగిందన్నదానిపై స్పష్టత లేదు.

అయితే సీఎం  రేవంత్ రెడ్డి మాత్రం దుబాయ్ తో కేదార్ తో పాటు బీఆర్ఎస్ కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్నారని అక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ కేసులు త్వరలో విచారణకు వస్తున్న సమయంలో ఇలాంటి మరణాలు అనుమానాస్పదమేనని స్పష్టం చేశారు.  తన వ్యాపార భాగస్వామి మరణంపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.  వీటిపై విచారణకు కేటీఆర్ ఎందుకు డిమాండ్ చేయరని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే తాము విచారణ చేయిస్తామన్నారు. 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆలస్యం చేస్తోంది కేంద్రమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విదేశాల్లో ఉన్న వారిని తీసుకు రావాల్సింది ఎవరని రేవంత్ ప్రశ్నించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.  ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును తీసుకు వస్తే నలభై ఎనిమిది గంటల్లో కేసీఆర్ , కేటీఆర్, హరీష్ రావులను అరెస్టు చేస్తామన్నారు.  కాళేశ్వరంపై నిపుణుల కమిటీ విచారణ జరుపుతోందని వారి విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపఎన్నికలు వస్తాయని కేసీఆర్, కేటీఆర్ అంటున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. అయితే ఎలా వస్తాయని రేవంత్ ప్రశ్నించారు. పదేళ్ల పాటు ఎంతో మంది ఎమ్మెల్యేలను ఫిరాయించినా రాని ఉపఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. 

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేనే లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ రాజకీయాల కోసం మాట్లాడుతోందని.. కాంగ్రెస్, బీజేపీ మధ్యనే తెలంగాణలో పోటీ జరుగుతోందన్నారు. బీజేపీ కోసం బీఆర్ఎస్ పని చేస్తోందన్నారు. ప్రధానమంత్రితో జరిగిన భేటీలో రాష్ట్రానికి రావాల్సిన, కావాల్సిన అంశాలపై  నివేదికలు ఇచ్చామన్నారు.  ఎస్ఎల్బీసీ పనులు  కమిషన్లు రావన్న కారణంగా పదేళ్ల పాటు నిలిపివేశారని రేవంత్ మండిపడ్డారు. ఈ కారణంగానే అ ప్రమాదం జరిగిందన్నారు. కార్మికులను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా ప్రధాని మోదీకి వివరించానని రేవంత్ రెడ్డి తెలిపారు.                   

Also Read: ప్రధానమంత్రి మోదీకి తెలంగాణ సీఎం రేవంత్ చేసిన వినతులు ఇవే !

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy BRS Allegations: రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ - ఆరోపణల హోరులో కాంగ్రెస్ సైలెన్స్ వెనుక వ్యూహమేంటి?
రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ - ఆరోపణల హోరులో కాంగ్రెస్ సైలెన్స్ వెనుక వ్యూహమేంటి?
Indiramma Towers: వారానికి ఒకసారి వచ్చి మీ ఇల్లు చూసుకోండి- ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపనలో మంత్రి పొంగులేటి
వారానికి ఒకసారి వచ్చి మీ ఇల్లు చూసుకోండి- ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపనలో మంత్రి పొంగులేటి
Vote for Note Case: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన స్టీఫెన్‌సన్‌
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన స్టీఫెన్‌సన్‌
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget