Andhra Pradesh Budget 2025-26: కూటమి ప్రభుత్వం తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే - ఆయా రంగాలకు కేటాయింపులు ఇలా
Andhra Pradesh Budget 2025-26:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ నేడు సభ ముందుకు రానుంది. పూర్తి వివరాలు, లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Background
Andhra Pradesh Budget 2025-26:ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ సభలోకి తీసుకురానుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రసంగం చేస్తారు. వ్యవసాయ బడ్జెట్‌ను శాసనసభలో అచ్చెన్నాయుడు చదివి వినిపించనున్నారు. మండలిలో నారాయణ ప్రవేశ పెట్టనున్నారు.
ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలతో అద్భుత విజయాన్ని కూటమి ప్రభుత్వం అందుకుంది. అందుకే తొలిసారి ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో వారికి ఎలాంటి కేటాయింపులు చేస్తారు. పథకాలు అమలు గురించి ఎలాంటి ప్రకటన చేస్తారు అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. ఈసారి బడ్జెట్ దాదాపు 3.24 లక్షల కోట్లతో రూపొందించారని తెలుస్తోంది.
ఎన్నికల తర్వాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ గతేడాదే పెట్టాల్సి ఉన్నప్పటికీ ఓటాన్ అకౌంట్‌తోనే గత ఆర్థిక సంవత్సరం నెట్టుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నందున పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేదు. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ ఆర్థిక విధ్వంసం చేసిందని పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేదు. రెండు దఫాలు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే సభ ముందుకు తెచ్చారు.
ఇప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థ ఇంకా సర్ధుకోలేదని చెబుతున్న ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలపై ఆలోచించి కేటాయింపులు చేసినట్టు తెలుస్తోంది. సూపర్ సిక్స్ కోసం బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ పోలవరం, రాజధాని అమరావతి, ఇతర ప్రాజెక్టులకు కూడా భారీగా కేటాయింపులు ఉంటాయని అంటున్నారు. వీటితోపాటు విద్య, వైద్యం, వ్యవసాయానికి కూడా అధిక నిధులు కేటాయించే ఛాన్స్ లేకపోలేదదు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు కేటాయింపులు విషయంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇలా అన్ని రంగాలను ప్రజలను పరిగణలోకి తీసుకొని బడ్జెట్ రూపకల్పన చేశారు.
పేపర్ లెస్ బడ్జెట్
ఆంధ్రప్రదేశ్‌లో కూడా పేపర్ లెస్ బడ్జెట్‌కు శ్రీకారం చుట్టారు. పుస్తకాలు ప్రిటింగ్ లేకుండా బడ్జెట్‌ను పెన్ డ్రైవ్‌లో సభ్యులకు ఇవ్వబోతున్నారు. మీడియాకు కూడా పెన్‌డ్రైవ్‌లోనే సమాచారం అందజేస్తారు. కేవలం ఆర్థిక మంత్రి చదివే ప్రతులు మాత్రమే ముద్రించి సభ్యులకు అందజేస్తారు. పూర్తి వివరాల కోసం పెన్‌డ్రైవ్‌లోని సమాచారం చూసుకోవాల్సి ఉంటుంది.
Andhra Pradesh Budget 2025: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమానికి కేటాయింపులు
Andhra Pradesh Budget 2025: అనంబద్ధ సామాజిక కట్టుబాట్లను ధిక్కరించి భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందిన శ్రీమతి సావిత్రిబాయి పూలే మాటలను గుర్తు చేశారు పయ్యావు కేశవ్. 'ఒక మహిళకు సాధికారత కల్పిస్తే-మొత్తం సమాజాన్నే ఉద్దరించినట్లు అవుతుంది' అన్న సిద్ధాంతాన్ని దృఢంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్వసించారు. "స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు సాధికారత కల్పించిన మొదటి వ్యక్తి. వంటగదికే పరిమితమైన మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా సామాజిక ఉద్యమంలో భాగమయ్యారు. మన రాష్ట్రం స్వయం సహాయక సంఘాల ఉద్యమానికి పర్యాయపదంగా, దేశానికే ఆదర్శంగా నిలిచింది. నేడు మన రాష్ట్రంలో 10 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు వని చేస్తూ రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. స్వయం సహాయక సంఘాల ద్వారా సాధించిన ఈ సాధికారత ఎంతగా ఉందంటే, రాష్ట్ర సంక్షేమ విధానాలను మరియు రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా డ్వాక్రా వ్యవస్థ రూపొందింది.
స్త్రీ నిధికి కేటాయించిన నిధులలో 750 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం ప్రక్కదారి పట్టించి, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక సాధికారతకు ఎంతో విఘాతం కలిగించింది. మహిళల ఆర్థిక అభ్యున్నతిలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషించేలా, మా ప్రభుత్వం ప్రస్తుతం దిద్దుబాటుచర్యలు చేపడుతోంది.
నమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐ.సి.డి.ఎస్.), మిషన్-శక్తి వంటి పథకాల ద్వారా మహిళలు, పిల్లలు మరియు కౌమారదశలో ఉన్నవారికి తగిన పోషకాహారం అందించేందుకు మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. మేనిఫెస్టోలోని హామీ మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ మంజూరు చేసిన ఘనత మా ప్రభుత్వానిదే. వృద్ధుల సంరక్షణ కోసం కొత్తగా 12 వృద్ధాశ్రమాలు మంజూరు చేయడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖకు 4,332 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను." అని చెప్పారు పయ్యావుల
Andhra Pradesh Budget 2025: వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయింపులు
Andhra Pradesh Budget 2025: "జీవితంలో ఒక్కసారైనా డాక్టర్, లాయర్, పోలీన్, బోధకుడు అవసరమని చెబుతూ ఉంటారు. కానీ రైతు ప్రతిరోజూ అవనరం.. మూడు పూటలా అవసరం. కాబట్టి అలాంటి అన్నదాతలకు ప్రగాఢ కృతజ్ఞతా భావంతో మేం మరో నూవర్ సిక్స్ హామీని నెరవేర్చడానికి సిద్దమవుతున్నామని తెలియచేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20 వేల రూపాయలు అందించేలా కేటాయింపులు చేశామని చెప్పడానికి గర్విస్తున్నాం. మా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 21.87 లక్షల వ్యవసాయ వంపుసెట్లకు 9 గంటల ఉచిత వగటిపూట విద్యుత్ను సరఫరా చేస్తోంది.
చేవల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సహాయాన్ని 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు రెట్టింపు చేస్తామనే మ్యానిఫెస్టోలోని మరో హామీని నెరవేర్చడానికి తగిన కేటాయింపులు చేశామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం, అనుబంధ రంగాలకు 13,487 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. "- పయ్యావుల కేశవ్





















