Revanth Reddy Latest News: పొలిటికల్ పద్మవ్యూహంలో రేవంత్ రెడ్డి! అర్జుడవుతాడా? అభిమాన్యుడవుతాడా?
Revanth Reddy Latest News: తెలంగాణ ముఖ్యమంత్రి ప్రయాణం కత్తిమీద సాములా మారింది. పైన మోదీ, ఇటు పక్క కిషన్ రెడ్డి, మరో పక్క బీఆర్‌ఎస్. పొలిటికల్ పద్మవ్యూహంలో చిక్కిన రేవంత్ నెక్ట్స్ మూవ్ ఏంటీ?

Revanth Reddy Latest News: తెలంగాణ ఏర్పాటైన తరువాత తొమ్మిదేళ్లపాటు రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్‌ను తన మాస్ ఫాలోయింగ్‌తో, రాజకీయ చతురతతో, వాటికి తోడు కాలం కలిసి వచ్చి సిఎం పదవి చేపట్టిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు కష్టాల కౌంట్‌డౌన్ షురూ అయినట్టు కనిపిస్తోంది. తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలు ఇవే సంకేతాలిస్తున్నాయి. రేవంత్ అధికారంలోకి వచ్చాక ఎత్తుకున్న అభివృద్ధి మంత్రం మూసీ పునరుజ్జీవం. కంపు కొడుతున్న మూసీని విదేశీపర్యాటక ప్రాంతాల మాదిరి సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు, వచ్చే ఆదాయంతో హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ది చేయంతోపాటు, సూపర్ సిక్స్ వంటి పథకాలకు తిరుగులేకుండా నిధులు సమకూర్చుకోవచ్చని అనుకున్నారు. అలా మూసీ వైపు మొదలైన అడుగులు తాజాగా ఢిల్లీ వరకూ చేరాయి. మోదీకి సీన్ టూ సీన్ వివరించినా, ఆశించిన స్థాయిలో ఫలితం లేదని, కేంద్రం నుంచి మరీ అంత ఎక్స్‌పెక్ట్ చేయొద్దని భేటీ తరువాత చెప్పకనే చెప్పనట్లు క్లారిటీ వచ్చేసింది.
మెట్రో ఫేజ్ టూ విషయంలోనూ అదే పరిస్థితి. ముందు భూసేకరణ జరగాలి. నిధులు సమకూరాలి. అన్ని కలిసొచ్చినా , కేంద్రం నుంచి హైదరాబాద్‌కు కాంగ్రెస్ హాయంలోనే ఏదైనా చేద్దాం అని ఉండాలి. కానీ మెట్రో విస్తరణ విషయంలో చేద్దాం, చూద్దాం అన్న మాటలు తప్ప, మాది బాధ్యత మీరు ముందుకెళ్లండి అంటూ రేవంత్ రెడ్డికి మోదీ నుంచి గ్యారెంటీ వచ్చినట్లు కనిపించలేదు. మరోవైపు సూపర్ సిక్స్ పేరుతో తెలంగాణలో పొలిటికల్ సీన్ మార్చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ సూపర్ సిక్స్ మరో నాలుగేళ్లపాటు నిర్విరామంగా అమలు చేయాలంటే మోదీ సర్కారు ఆర్థిక సహాకారంతో కచ్చితంగా కావాలి. కానీ పరిస్థితులు కనుచూపుమేరలో కూడా అలా కనిపించడంలేదు. ఇలా కేంద్రం నుంచి సహకారం అటుంచితే. ఇక్కడ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నుంచైనా కాస్తోకూస్తో మద్ధతు దొరుకుతుందంటే అదీలేదు. ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఇప్పటికే రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి ప్రతీ రోజూ మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఢీ అంటే ఢీ అంటూ విమర్శలు చేసుకుంటున్నారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. మాకు చెప్పి మీరు ప్రజలకు హామీ ఇచ్చారా... కేంద్రం ఇచ్చే నిధులతోనే తెలంగాణను అభివృద్ది చేస్తామని ఎన్నికల్లో చెప్పారా , ప్రధాని నరేంద్రమోడీ డబ్బులు ఇస్తేనే ప్రాజెక్టలు పూర్తి చేస్తామని అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు చెప్పారా? ఇలా రాష్ట్రాలు కేంద్రాన్ని బెదిరింపు ధోరణితో మాట్లడటం మానుకోవాలంటూ రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు మీరు అనుకున్నట్లు మేము సహకరించాలి అని రూల్ లేదంటూ చెప్పకనే చెప్పేశారు కిషణ్ రెడ్డి. ఇలా ఓవైపు తెలంగాణ అభివృద్ధికి ఐకాన్‌గా , కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలకంగా మారిన మూసీ, మెట్రో విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులు కేంద్రం సహకారం లేకుండా ముందుకు తీసుకెళ్లడమంటే రేవంత్ రెడ్డికి కత్తిమీద సామే. మరోవైపు పక్కలో బల్లెంలా బిఆర్‌ఎస్ ఎలానో ఉండనే ఉంది. ఇలా ఓవైపు కేంద్రంలో బిజెపి, లోకల్ కిషన్ రెడ్డి, ఏనీ టైమ్ మేము సైతం అన్నట్లు బిఆర్ఎస్ కీలక నేతలు ఇలా పొలిటికల్ పద్మవ్యూహంలో చిక్కున్నట్లయ్యింది రేవంత్ రెడ్డి పరిస్థితి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

