అన్వేషించండి

Smartphones: స్మార్ట్‌ఫోన్ కొనబోతున్నారా? కొంచెం ఆగండి, మార్చిలో మిర్చి లాంటి మోడళ్లు వస్తున్నాయ్‌

New Smartphones Launching: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే కొన్ని రోజులు ఆగడం మంచిది. మార్చిలో శామ్‌సంగ్‌, నథింగ్‌, వివో సహా చాలా కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నాయి.

Smartphones Launching In March 2025: ఆపిల్ ఐఫోన్ 16e ‍‌(Apple iPhone 16e) సహా అనేక ఇతర స్మార్ట్‌ఫోన్‌లు ఫిబ్రవరిలో లాంచ్‌ అయ్యాయి, టెక్నాలజీ ప్రియులను అలరించాయి. వచ్చే నెల (మార్చి 2025) కూడా స్మార్ట్‌ఫోన్ అభిమానులకు ప్రత్యేకంగా మారబోతోంది. నథింగ్, శామ్‌సంగ్‌తో సహా ఇతర ప్రముఖ కంపెనీలు మార్చి నెలలో కొత్త మోడళ్లను విడుదల చేయబోతున్నాయి. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే, మార్చిలో మీకు ఎక్కువ ఆప్షన్స్‌ అందుబాటులోకి వస్తాయి. 

మార్చిలో కొత్త మోడళ్లు లాంచ్‌ చేయనున్న స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు

నథింగ్ ఫోన్ 3a సిరీస్ ‍‌(Nothing Phone 3a series Smartphones)

మార్చి 4న లాంచ్ ఈవెంట్ జరుగుతుందని "నథింగ్"ప్రకటించింది, "Nothing Phone 3a" సిరీస్ ఆ ఈవెంట్‌లో లాంచ్‌ అవుతుంది. ఈ సిరీస్‌లో "Nothing Phone 3a" & "Nothing Phone 3a Pro" మోడళ్లను ఆవిష్కరించవచ్చు. 2a & 2a Plusతో పోలిస్తే ఈ రెండు కొత్త మోడళ్లు కొత్త లుక్‌తో, అప్‌గ్రేడెడ్‌ ఫీచర్లతో వస్తాయని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. Nothing Phone 3a Proలో 50MP పెరిస్కోప్ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు.

ఐకూ నియో 10ఆర్‌ 5జీ ‍‌(iQOO Neo 10R 5G Smartphone)

"iQOO" మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. మార్చి 11న "iQOO Neo 10R 5G" స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. దీనిని అమెజాన్ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా విక్రయిస్తారు. "iQOO Neo 10R 5G" ధర రూ.30,000 లోపు ఉండవచ్చు. ఇది 6.78 అంగుళాల పెద్ద OLED డిస్‌ప్లే & స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్‌తో వస్తుందని భావిస్తున్నారు. వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా ఉండవచ్చు.

వివో టీ4ఎక్స్‌ 5జీ ‍‌(Vivo T4x 5G Smartphone)

Vivo T4x 5G స్మార్ట్‌ఫోన్‌ కూడా మార్చిలో లాంచ్ అయ్యే సిగ్నల్స్‌ కనిపిస్తున్నాయి. ఈ ఫోన్‌ ఫీచర్ల గురించి టీజ్‌ చేస్తూ, వివో కంపెనీ ఓ టీజర్‌ విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 6.72 అంగుళాల FHD + IPS LCD డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300, 50MP ప్రధాన సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ & ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500 mAh బ్యాటరీ ఒదిగి ఉంటాయని టీజర్‌ వెల్లడించింది. ఈ మోడల్‌ లాంచింగ్‌ డేట్‌ను ఇంకా నిర్ణయించలేదు.

శామ్‌సంగ్‌ ‍‌(Samsung) నుంచి మూడు ఫోన్లు 

మార్చిలో మూడు కొత్త ఫోన్‌ మోడళ్లను విడుదల చేయడానికి శామ్‌సంగ్ సన్నాహాలు చేస్తోంది. Galaxy A సిరీస్‌లో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్చి 02న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అవి - Galaxy A36, Galaxy A56, Galaxy A26 స్మార్ట్‌ఫోన్‌లు. టీజర్‌లో ఉన్న ప్రకారం, ఈ ఫోన్లు మెటల్ ఫ్రేమ్‌తో రావచ్చు.

పోకో ఎం7 5జీ (POCO M7 5G Smartphone)

జియోమీ (Xiaomi) సబ్‌ బ్రాండ్ "POCO", భారతదేశంలో "POCO M7 5G Smartphone" లాంచ్‌ను అధికారికంగా ధృవీకరించింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ మార్చి 03న లాంచ్ అవుతుంది. ఇది బడ్జెట్‌ ఫోన్‌. 12GB RAM (6GB ఫిజికల్‌ RAM + 6GB వర్చువల్ RAM) & స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌తో రూ. 10,000 కంటే తక్కువ ధరలో వస్తున్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదేనని కంపెనీ వెల్లడించింది.

మరో ఆసక్తికర కథనం: విమాన ప్రయాణంపై బంపర్‌ ఆఫర్‌ - కేవలం 11 రూపాయలకే ఫ్లైట్‌ టికెట్ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget