Telangana schools Holiday: ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్..తెలంగాణలో పాఠశాలలకు ఇవాళ సెలవు
Telangana schools Holiday: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో పలు జిల్లాలోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ట్విస్ట్ ఏంటంటే?

Telangana schools Holiday:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ పోలింగ్ నేపధ్యంలో కొన్ని జిల్లాలకు మాత్రమే స్కూల్స్ బంద్ కానున్నాయి. తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు సర్వం సిద్దమైంది. తెలంగాణాలో మెదక్, ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్‌తో పాటు నిజామాబాద్ (టీచర్స్ ,గ్రాడ్యూడేట్ ) రెండు ఎమ్మెల్సీ స్థానానాలతోపాటు వరంగల్, ఖమ్మం (టీచర్ )ఎమ్మెల్సీ స్థానానికి మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సిబ్బంది, ఆయా పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకోవడంతోపాటు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు మొదలయ్యే పోలింగ్ సాయంత్రం 4గంటల వరకూ కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో పోలింగ్ కేంద్రాల 144 సెక్షన్ అమలులో ఉండటంతోపాటు ఇప్పటికే మద్యం షాపులకు తెరవకూడదంటూ ప్రభుత్వ ఆదేశాలు జారీచేసింది.
నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, కరీంనగర్‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణలో పోలింగ్ జరుగుతున్న పలు జిల్లాలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించింది విద్యాశాఖ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ ఉదయం నుంచే మొదలవుతున్న నేపథ్యంలో ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు సంబంధిన విద్యాశాఖ కార్యాలయాల నుంచి ఇప్పటికే సమాచారం చేరుకుంది. పోలింగ్ నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, మరోవైపు విద్యార్థుల తరగతుల నిర్వహణతో పోలింగ్ ప్రక్రియకు ఆటకం లేకుండా ఉండే విధంగా సెలవు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని పాఠశాలకు ఈ సెలవు వర్తించదు.
పోలింగ్ ప్రభావం ఉన్న కొన్ని జిల్లాలకు మాత్రమే సెలవు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రకటించారు. ఫిబ్రవరి 27న పాఠశాలలు సెలవు ప్రకటించిన జిల్లాలు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల, రాజన్నపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జయశంకర్ భూషణ్‌పల్లి జిల్లాలలో పాఠశాలకు సెలవు వర్తిస్తుంది. ఈ జిల్లాలలో పాఠశాలకు సెలవు ఇస్తున్నట్లు ఇప్పటికే స్థానిక విద్యాశాఖ అధికారి నుంచి స్పష్టమైన ఆదేశాలు, ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయునికి చేరుకున్నాయి. వీటితోపాటు జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, మహబూబాబాద్. ఈ జిల్లాలన్నింటికీ గురువారం MLC ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. పాఠశాలల మూసివేత కారణంగా సజావుగా పోలింగ్ ప్రక్రియను జరపడంతోపాటు, బ్యాలెట్ బ్యాక్సుల తరలించే విషయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగే అవకాశం ఉంది.
పోలింగ్ రోజు శాంతిభద్రతలను కాపాడేందుకుపైన తెలిపిన జిల్లాల్లోని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నందున విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ప్రకటించారు. ఆయా జిల్లాల్లోని పాఠశాలలు మూసివేయడంతోపాటు విద్యాపరమైన ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకూడదంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.





















