Hyderabad Central University: హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణంలోని భవనం - వెంట్రుకవాసిలో తప్పించుకున్న కార్మికులు
HCU: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో నిర్మాణంలో ఉన్నభవనం కుప్పకూలింది. శిథిలాల్లో చిక్కుకున్న ఓ కార్మికుడిని కాపాడారు.

HCU building collapse : హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీలో ర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఒక్క సారిగా కుప్పకూలింది. సాయంత్రం కావడంతో కార్మికులవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే భవనం కూలిపోయినట్లు భావిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అవసరాలకు సరిపోకపోవడంతో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం నిధులు విడుదల కావడంతో కాంట్రాక్టర్ కు పని అప్పగించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మొదటి ఫ్లోర్ సెంట్రింగ్ వేస్తున్న సమయంలో నే కుప్పకూలింది. అప్పటికే సెంట్రింగ్ పైన ఐరన్ రాడ్లు అమర్చారు.
శ్లాబ్ పోయడానికి ఏర్పాట్లు చేసిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఉదయమే కార్మికులు పని చేసి సాయంత్రానికి వెళ్లిపోయారు. ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. వారిపై శిథిలాలు పడకపోవంతో పెను ప్రమాదం తప్పింది. వారిని పోలీసులు అతి కష్టం మీద బయటకు తీసుకు వచ్చారు.
నిర్మాణం కుప్పకూలిన విషయం గురించి తెలియగాన పోలీసులు, రెస్క్యూ బృందాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సెంట్రల్ వర్శిటీ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయి.. అవినీతి చేయడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కమిషన్లు కొట్టేసి నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారని అంటున్నారు.





















