అన్వేషించండి

Pune Crime News: అత్యాచార నిందితుడి కోసం డ్రోన్లతో గాలింపు- 70 గంటల తర్వాత చెరకు తోటలో అరెస్టు

Pune Crime News:పూణే అత్యాచారం కేసు నిందితుడు దత్తాత్రేయ రాందాస్ గడేను పోలీసులు 70 గంటల తర్వాత అరెస్టు చేశారు. అతని కోసం డ్రోన్‌లు కూడా ఉపయోగించి విస్తృతంగా గాలించారు. 

Pune Crime News: మహారాష్ట్రలోని పూణే జరిగిన అత్యాచార ఘటన సంచలనంగా మారింది. స్వర్‌గేట్ బస్ స్టాండ్ వద్ద ఆగి ఉన్న మున్సిపల్ బస్సులో దత్తాత్రేయ గడే మహిళపై అత్యాచారం చేశాడు. 26 ఏళ్ల మహిళను రేప్ చేసిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి వేటలో పడ్డారు. నేరం చేసిన తర్వాత దత్తాత్రేయ గడే పరార్ అయ్యాడు. తన స్వగ్రామం అయిన శిరూర్‌లోనే ఉన్నప్పటికీ పోలీసులు పట్టుకోవడానికి మూడు రోజులు పట్టింది. చివరకు స్థానికంగా ఉండే ఓ చెరుకుతోటలో అర్థరాత్రి అరెస్టు చేశారు. 

పూణే నగర డీసీపీ క్రైమ్ నిఖిల్ పింగలే తెలిపిన వివరాల ప్రకారం... నిందితుడు గత రెండు రోజులుగా సొంతూరిలోనే దాక్కున్నాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 13 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడిని కనిపెట్టిన వారికి లక్ష రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. 

పూణే అత్యాచారం కేసు నిందితుడు దత్తాత్రేయ రాందాస్ గడే మంగళవారం నుంచి పరారీలో ఉన్నాడు. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో స్వర్‌గేట్ బస్ స్టాండ్ వద్ద ఆగి ఉన్న బస్సులో 26 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసినట్లు అతనిపై కేసు బుక్ అయింది.  

బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళను ఆమె వేచి ఉన్న బస్సు వేరే చోట ఆపి ఉందని చెప్పి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేకపోవడం చూసి బస్సులో కూర్చోబెట్టాడు. తర్వాత అక్కడే ఆగి ఉన్న బస్సు లోపల అత్యాచారం చేశాడు. పోలీస్ స్టేషన్‌కు దాదాపు 100 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడం పెను సంచలనమైంది.  

చెరకు తోటలలో పోలీసులు సోదాలు  

నిందితుడి స్వస్థలంలో ఉండే చెరకు తోటల్లో పూణే పోలీసులు సోదాలు ప్రారంభించారు. సీనియర్ అధికారులతో సహా 100 మందికిపైగా పోలీసులు గురువారం అక్కడకు చేరుకున్నారు, ఈ ఆపరేషన్‌లో డ్రోన్‌లను కూడా వాడుకున్నారు.  డ్రోన్‌లను ఎగరేస్తూ నిందితుడు ఎక్కడ ఉన్నాడో పరిశీలించే ప్రక్రియ చేపట్టారు. 

ఓవైపు చెరకు తోటల్లో వెతుకుతూనే పూణేలోని ప్రతి ప్రాంతంపై నిఘా పెట్టారు. అన్ని ఎంట్రీలు, ఎగ్జిట్‌లు, ముఖ్యమైన బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు భద్రతను పెంచారు. అత్యాచార నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రివార్డు కూడా ప్రకటించారు. లక్ష రూపాయల బహుమతిని ఇస్తామని తెలిపారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిపై పూణే, సమీపంలోని అహల్యానగర్ జిల్లాల్లో దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ వంటి అనేక క్రిమినల్ కేసులు ఇప్పటికే ఉన్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Wayanad Landslide: వయనాడ్‌లో కొండ చరియల భీభత్సం.. భయం గొలుపుతున్న CCTV విజువల్స్  
వయనాడ్‌లో కొండ చరియల భీభత్సం.. భయం గొలుపుతున్న CCTV విజువల్స్  
Wayanad Landslide: కేరళలోని వయనాడ్‌లో ఆగని విషాదాలు! కొండచరియలు విరిగిపడి మరో ముగ్గురు మృతి! ప్రకృతి బీభత్సానికి కారణమేంటీ?
కేరళలోని వయనాడ్‌లో ఆగని విషాదాలు! కొండచరియలు విరిగిపడి మరో ముగ్గురు మృతి! ప్రకృతి బీభత్సానికి కారణమేంటీ?
Wayanad Tunnel Landslide: వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం - విరిగిపడిన కొండ చరియలు - ఒళ్ల గగుర్పొడిచే దృశ్యాలు
వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం - విరిగిపడిన కొండ చరియలు - ఒళ్ల గగుర్పొడిచే దృశ్యాలు
Breaking News: రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ఇప్పటివరకూ రూ.7,490.72 కోట్లు జమ: మంత్రి తుమ్మల
రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ఇప్పటివరకూ రూ.7,490.72 కోట్లు జమ: మంత్రి తుమ్మల

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి..
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి..
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Embed widget