Ramana Gogula: 'గోదారి గట్టు మీద...' సూపర్ సక్సెస్ తర్వాత తెలుగులో మరో సాంగ్ పాడిన రమణ గోగుల
'సంక్రాంతికి వస్తున్నాం'లో రమణ గోగుల పాడిన 'గోదారి గట్టు మీద రామ సిలకవే' సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆయన తెలుగులో మరో పాట పాడారు. అది ఏ సినిమాలో ఉంది? ఆ సాంగ్ ఏమిటి? అంటే...

రమణ గోగుల (Ramana Gogula) సంగీతానికి, ఆయన స్వరానికి తెలుగులో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను ఊపు ఊపిన సంగీత దర్శకుడు, రచయిత. అయితే... కొంత విరామం తర్వాత విక్టరీ వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాలో 'గోదారి గట్టు మీద రామ సిలకవే...' సాంగ్ పాడారు. అది చార్ట్ బస్టర్ అయ్యింది. ఈ జోరు, హుషారులో ఆయన మరో తెలుగు సినిమాలో సాంగ్ పాడారు.
నారి సినిమాలో... నా గుండె లోనా సాంగ్!
ఆమని (Aamani) ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'నారి' (Naari The Women Movie). వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదిని ఇతర ప్రధాన తారాగణం. సూర్య వంటిపల్లి దర్శకత్వంలో శ్రీమతి శశి వంటిపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో 'నా గుండె లోనా' అంటూ సాగే గీతాన్ని రమణ గోగుల ఆలపించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ పాటను తాజాగా విడుదల చేశారు.
'నా గుండె లోనా' పాట విడుదల చేసిన సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... ''వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి మీద ఈ పాటను చిత్రీకరించాం. వినోద్ కుమార్ విన్ను ఈ పాటకు అందమైన బాణీ సమకూర్చారు. ఈ మధ్య 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలోని 'గోదారి గట్టు మీద... రామ సిలకవే' పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రమణ గోగుల మా పాటను పాడటం సంతోషంగా ఉంది'' అని చెప్పారు.
మార్చి 7న థియేటర్లలోకి 'నాని' సినిమా
మహిళల్ని గౌరవించాలని, ఆడ పిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలనే కథతో రూపొందిన సినిమా 'నారి'. ఇప్పుడు ఉన్న సామాజిక పరిస్థితుల్లో పదమూడు నుంచి ఇరవై ఏళ్ల పిల్లలు ప్రమాదంలో ఉన్నారనే విషయాన్నిచెబుతూ దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారని నిర్మాత తెలిపారు. మహిళా సాధికారత గొప్పదనాన్ని చెప్పే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న థియేటర్లలో విడుదల చేస్తున్నామని చెప్పారు. 'నారి' నుంచి ఇంతకు ముందు విడుదల చేసిన 'ఈడు మగాడేంట్రా బుజ్జి...', 'నిశిలో శశిలా...' పాటలకు మంచి స్పందన లభించిందన్నారు.
Also Read: తెలుగులో విడుదలకు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఛావా' రెడీ... ఎన్టీఆర్ డబ్బింగ్‌లో నిజమెంత?
ఆమని ప్రధాన పాత్రలో, వికాస్ వశిష్ఠ, కార్తికేయ దేవ్, నిత్య శ్రీ, మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదిని, ఛత్రపతి శేఖర్, నాగ మహేశ్, సునైన, రామచంద్ర, రాజశేఖర్, ఫణి, గీతాకృష్ణ రెడ్డి, ధృవన్ వర్మ, రాజమండ్రి శ్రీదేవి, సత్తన్న, వి. లోకేష్, నాగిరెడ్డి, అచ్యుత రామారావు, శేఖర్ నీలిశెట్టి, లడ్డు, గూడ రామకృష్ణ, శ్రీలత, భార్గవి, శ్రీవల్లి, సాయి రేణుక, గీత, మహేశ్, వినయ్, అఖిల్ యడవల్లి, తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఛాయాగ్రహణం: వి రవికుమార్ - భీమ్ సాంబ, ఎగ్జిక్యూటివ్ డీవోపీ: కృష్ణ, సంగీతం: వినోద్ కుమార్ విన్ను, సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్ - ప్రసాద్ సానా, గాయనీ గాయకులు: రమణ గోగుల - ఆర్పీ పట్నాయక్ - సునీత - చిన్మయి శ్రీపాద - సి. షోర్, కూర్పు: మాధవ్ కుమార్ గుల్లపల్లి, నిర్మాత: శ్రీమతి శశి వంటిపల్లి, దర్శకత్వం: సూర్య వంటిపల్లి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

