MAD movie song : ప్రౌడ్ సే సింగిల్, ఇది భీమ్స్ బీట్ - ఎన్టీఆర్ బావమరిది నితిన్ 'మ్యాడ్'లో సాంగ్!
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ ఓ హీరోగా నటించిన 'మ్యాడ్' సినిమాలో తొలి పాట 'ప్రౌడ్ సే సింగిల్'ను విడుదల చేశారు.

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) బావమరిది, పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాస రావు తనయుడు నార్నే నితిన్ (Narne Nithin) ఓ కథానాయకుడిగా నటించిన చిత్రం 'మ్యాడ్' (MAD Movie). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్న చిత్రమిది. ఇందులో తొలి పాట 'ప్రౌడ్ సే సింగిల్' విడుదల చేశారు.
భీమ్స్ బీట్... ప్రౌడ్సే సింగిల్!
'పేపర్ బాయ్' సినిమాలో 'బొంబాయి పోతా రాజా' నుంచి మాస్ మహారాజ రవితేజ 'ధమాకా' వరకు, ఆ తర్వాత... ఎన్నో సినిమాల్లో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన అందించిన బాణీకి 'ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్...' అంటూ రఘురామ్ ఈ సాంగ్ రాశారు. నకాష్ అజిజ్, భీమ్స్ సిసిరోలియో పాడారు.
Also Read : దుబాయ్ వెళ్లిన ఎన్టీఆర్ - 'ఆర్ఆర్ఆర్'కు బెస్ట్ యాక్టర్‌గా అవార్డు
'మ్యాడ్' చిత్రాన్ని (Mad Movie Telugu) సూర్యదేవర నాగ వంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హారిక సూర్యదేవర నిర్మిస్తున్నారు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థపై ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయాలని భావించినా... వాయిదా వేశారు. అక్టోబర్ 6న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Also Read : రాయల్ ఫ్యామిలీ వారసుడిగా ఎన్టీఆర్ - 'దేవర' కథలో అసలు ట్విస్ట్ ఇదే!?
'మ్యాడ్'లో మరో ఇద్దరు కథానాయకులు!
'మ్యాడ్' చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నార్నే నితిన్ ఓ కథానాయకుడు కాగా... సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, యూట్యూబర్ రామ్ నితిన్ మరో ఇద్దరు కథానాయకులు. శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యాన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
యువతను టార్గెట్ చేస్తూ తీసిన సినిమా!
'మ్యాడ్' టీజర్ చూస్తే సినిమా జానర్ ఏమిటి? అనేది ఈజీగా అర్థం అవుతోంది. మరీ ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ తీసిన కామెడీ ఫిల్మ్ అని చెప్పవచ్చు. టీజర్లో కొన్ని డైలాగుల్లో డబుల్ మీనింగ్ ధ్వనించింది. సినిమా ఎలా ఉంటుంది? అనేది విడుదలైన తర్వాత తెలుస్తుంది. త్వరలో ట్రైలర్ విడుదల చేయడానికి ప్లాన్ చేశారట.
రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు, అంతోనీ, శ్రీకాంత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'మ్యాడ్' చిత్రానికి ఫైట్ మాస్టర్ : కరుణాకర్, అడిషనల్ స్క్రీన్ ప్లే : ప్రవీణ్ పట్టు, ప్రణయ్ రావు తక్కళ్లపల్లి, కళా దర్శకత్వం : రామ్ అరసవిల్లి, కూర్పు : నవీన్ నూలి, ఛాయాగ్రహణం : షామ్ దత్ సైనుద్దీన్ - దినేష్ కృష్ణన్ బి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణ సంస్థలు : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సమర్పణ : సూర్యదేవర నాగ వంశీ, నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య, రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

