శారీ కట్టడం ఒక ఆర్ట్ అయితే... అందులో 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి పర్ఫెక్ట్ అని చెప్పాలేమో! శారీలో ఆమె ఫోటోస్ చూడండి! 'డీజే టిల్లు' సినిమాలో నేహా శెట్టి బ్లాక్ శారీలో ఉన్న సీన్స్ కొన్ని ఉంటాయి. ఆ శారీలో ఆమె బావున్నారని పేరొచ్చింది. 'బెదురులంక 2012' సినిమాలోనూ 'వెన్నెల్లో ఆడపిల్ల' పాటలో నేహా శెట్టి శారీ కట్టారు. ఆ పాటకు కూడా మంచి పేరొచ్చింది. సినిమాల్లో మాత్రమే కాదు... మూవీ ప్రమోషన్స్ కు కూడా నేహా శెట్టి శారీలో వస్తూ ఉంటారు. నేహా శెట్టి లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శారీ ఫోటోలు ఇవి! నేహా శెట్టి నటించిన తాజా సినిమా 'రూల్స్ రంజన్'. అక్టోబర్ 6న విడుదల అవుతోంది. నేహా శెట్టి, కిరణ్ అబ్బవరం మీద తెరకెక్కించిన 'సమ్మోహనుడా' పాటకు రెస్పాన్స్ బావుంది. 'రూల్స్ రంజన్' హిట్ అయితే 'డీజే టిల్లు', 'బెదురులంక 2012' తర్వాత ఆమె హ్యాట్రిక్ కొట్టినట్టే. నేహా శెట్టి (all images courtesy : nehasharmaofficial / instagram)