లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లే బాడీ పార్ట్స్ కి, వాయిస్, స్మైల్‌కు బీమా తీసుకున్న సెలబ్రిటీలు ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం! అద్భుతమైన యాక్టింగ్, గూస్ బమ్స్ తెప్పించే వాయిస్ కు ప్రసిద్ధి గాంచిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. తన గొంతుకు బీమా చేయించారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన అమూల్యమైన చిరునవ్వును బీమా చేయించి కాపీరైట్ పొందింది. 'V' షేప్ బాడీ మెయింటైన్ చేస్తున్న బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం.. తన బట్ ను రూ. 10 కోట్లకు బీమా చేయించుకున్నాడు. ఎల్లప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ భామ రాఖీ సావంత్ కూడా తన బట్ కి ఇన్సూరెన్స్ చేయించింది. 'గదర్ 2' తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన సీనియర్ హీరో సన్నీ డియోల్.. తన వాయిస్ & డైలాగ్ డెలివరీ స్టైల్‌కు బీమా చేయించాడు. గ్లామరస్ బ్యూటీ మల్లికా షెరావత్ ఏకంగా తన శరీరంలోని అన్ని భాగాలకు ఒక అమెరికన్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ వద్ద బీమా చేయించింది. భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా.. తనకు ఎన్నో టైటిల్స్ తెచ్చిపెట్టిన తన చేతులకు బీమా చేయించింది. 'కభీ ఖుషి కభీ గమ్' సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ తన వేళ్లకు ఇన్సూరెన్స్ చేయించాడు. 'నైటింగేల్ ఆఫ్ ఇండియా'గా పేరుగాంచిన గాయని లతా మంగేష్కర్.. తన మధురమైన గాత్రానికి బీమా చేయించింది. అమెరికన్ యాక్ట్రెస్ జూలియా రాబర్ట్స్ తన చిరునవ్వును $ 30 మిలియన్లకు బీమా చేయించింది. పాపులర్ అమెరికన్ సింగర్ మడోన్నా తన రొమ్ము భాగాన్ని $ 2 మిలియన్లకు బీమా చేయించింది. అమెరికన్ యాక్ట్రెస్, సింగర్ జెన్నిఫర్ లోపెజ్ తన బట్ ను $ 300 మిలియన్లకు ఇన్సూరెన్స్ చేయించింది. జెన్నిఫర్ కి బీమా చేసిన అదే అమెరికన్ కంపెనీ వద్ద మాజీ మిస్ ఇండియా నేహా ధూపియా కూడా తన బట్‌కు బీమా చేసింది.