స్మైల్ ఒక ఫ్రీ థెరపీ అంటూ అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్ షేర్ చేసిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. చిరునవ్వులు చిందిస్తూ, కన్నుగీటి కవ్విస్తున్న అమ్మడి ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఓ అవార్డ్ ఫంక్షన్ లో విమెన్స్ అఛీవర్ పురస్కారం అందుకున్న ఐశ్వర్య.. ఇన్స్టా రీల్ తో సోషల్ మీడియాలో సందడి చేసింది. తెలుగు మూలాలున్న ఈ చెన్నై పొన్నుకు రెండు ఇండస్ట్రీలలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమె హాస్య నటి శ్రీలక్ష్మి మేనకోడలు.. 38 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన నటుడు రాజేష్ కుమార్తె. 'రాంబంటు' చిత్రంలో చిల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేసిన ఐశ్వర్య.. కోలీవుడ్ లో హీరోయిన్ గా లాంచ్ అయింది. వైవిధ్యమైన చిత్రాలు, నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. 'వరల్డ్ ఫేమస్ లవర్' 'టక్ జగదీశ్' లో 'రిపబ్లిక్' చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రెండు తమిళ చిత్రాలతో పాటుగా మూడు మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది ఐశ్వర్య రాజేష్.