అందాల భామ పాయల్ రాజ్ పుత్ లండన్ వీధుల్లో షికారు చేస్తోంది. ఇటీవల వెకేషన్ కు వెళ్ళిన ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు అక్కడి విశేషాలను రీల్స్, ఫోటోల రూపంలో పంచుకుంటూ వస్తోంది. ట్రెండీ ఔట్ ఫిట్స్ లో అమ్మడి స్టన్నింగ్ ఫోజులకు నెటిజన్స్ ఫిదా అయ్యారు. లండన్ ట్రిప్ ముగిసిందని చెబుతూ పాయల్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. 'Rx 100' మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పాయల్. తొలి చిత్రంతోనే తన హాట్ అందాలతో, బోల్డ్ పెర్ఫామెన్స్ తో కుర్రకారు మతులు పోగొట్టింది. అయితే క్రేజీ ఆఫర్స్ అందుకుంది కానీ, సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న పాయల్.. ప్రస్తుతం 'మంగళవారం' సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. 'Rx 100' ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న 'మంగళవారం' మూవీ మంచి విజయాన్ని అందిస్తుందని భావిస్తోంది.