రంభ ఆ పార్ట్‌లకు బీమా చేయించుకుందా? ఆమె ఏం చెప్పింది? ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన రంభ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో దాదాపు పెద్ద హీరోలు అందరితో రంభ నటించింది. అవకాశాలు ఉన్నప్పుడే రంభ.. సినిమాలకు వీడ్కోలు చెప్పి పెళ్లి చేసుకుంది. రంభ ప్రస్తుతం తన భర్తతో కెనడాలో స్థిరపడింది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, రంభ తన తొడలకు ఇన్సురెన్స్ చెయ్యించుకుందనే వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. ఇటీవల ఇండియాకు వచ్చిన రంభ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘తొడల’ బీమాపై స్పందించింది. ‘‘నేను నా తొడలను బీమా చేయించుకున్నానని వార్తలు వచ్చాయి. అలాంటిది ఏమీ లేదు’’ అని తెలిపింది. ఆ అవకాశం ఉంటే నేను నా జుట్టుకు బీమా చెయించుకోగలను అని రంభ తెలిపింది. Images Credit: Rambha/Instagram