అన్వేషించండి

NTR Devara Story : రాయల్ ఫ్యామిలీ వారసుడిగా ఎన్టీఆర్ - 'దేవర' కథలో అసలు ట్విస్ట్ ఇదే!?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందుతున్న భారతీయ సినిమా 'దేవర'. ఇందులో హీరో క్యారెక్టర్, ఇంకా కథ, అసలు ట్విస్ట్ బయటకు వచ్చేశాయి.

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'దేవర' (Devara Movie). ప్రస్తుతం చిత్రీకరణలో జరుగుతోంది. హైదరాబాద్ సిటీలో సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 

జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులు మెచ్చిన, 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ పురస్కారం అందుకున్న 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రమిది. దాంతో సినిమాపై క్రేజ్ నెలకొంది. అంతే కాదు... కథ ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో ఉంది. వాళ్ళకు ఓ గుడ్ న్యూస్! 'దేవర' కథ, అందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి తెలిసింది. 

రాయల్ ఫ్యామిలీ వారసుడిగా ఎన్టీఆర్!
అనగనగా ఓ సముద్ర తీరం! అక్కడ ఓ రాయల్ ఫ్యామిలీ ఉంటుంది. నరరూప రాక్షసుల వంటి మృగాల చేతిలో ఆ తీర ప్రాంత ప్రజలు దాడికి గురి అవుతారు. వాళ్ళ సంరక్షణ బాధ్యత తమది అని రాజ కుటుంబం మాట ఇస్తుంది. అప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న రాయల్ ఫ్యామిలీ వారసుడు ఎన్టీఆర్ అడుగు పెట్టి... రాక్షస సంహారం చేస్తారు. మృగాల మధ్య పెరిగిన మేలిమి ముత్యం లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. - ఇదీ కథ అని ఐఎండిబి వెబ్ సైట్ పేర్కొంది. హీరోయిన్ జాన్వీ కపూర్ పాలు అమ్మే యువతి పాత్రలో నటిస్తున్నట్లు కూడా తెలిపింది.

Also Read మహాశివునిగా ప్రభాస్ - ఇది కదా క్రేజీ న్యూస్ అంటే!  


NTR Devara Story : రాయల్ ఫ్యామిలీ వారసుడిగా ఎన్టీఆర్ - 'దేవర' కథలో అసలు ట్విస్ట్ ఇదే!?

ఎన్టీఆర్ ఇమేజ్ గురించి ప్రేక్షకులకు తెలిసిందే. స్టార్ స్టేటస్ అండ్ యాక్టింగ్ టాలెంట్ ఉన్న హీరో ఆయన. ఎన్టీఆర్ నుంచి అభిమానులు ఆశించే కమర్షియల్ అంశాలతో పాటు దర్శకుడు కొరటాల శివ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ తరహా కథలో ఎన్టీఆర్ అంటే... సినిమా ఓ రేంజ్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 

వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల
వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆఖరుకు చిత్రీకరణ పూర్తి కానుందని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య పాత్రలో సీరియల్ నటి చైత్ర రాయ్, కీలక పాత్రలో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప నటిస్తున్నారు. 

Also Read మెహర్ రమేష్ తీసిన 'మెగా' డిజాస్టర్ - చిరంజీవి 'భోళా శంకర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

'దేవర' చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. కొరటాల శివ మిత్రుడు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మాతలు. 'విక్రమ్', 'జైలర్', 'జవాన్'... వరుస విజయాలతో దూసుకు వెళుతున్న యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. 

'దేవర' తర్వాత హిందీలో 'వార్ 2' చేయనున్నారు ఎన్టీఆర్. ఆ సినిమాలో హృతిక్ రోషన్, ఆయన కలిసి నటించనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసే చిత్రాలు అన్నీ జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నవే. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Raithu Bharosa: రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
Andhra Pradesh News: వైసీపీ ఎంపీపీ ఇంటిపైకి బుల్డోజర్‌ - టీడీపీ తిరువూరు ఎమ్మెల్యేపై విమర్శలు
వైసీపీ ఎంపీపీ ఇంటిపైకి బుల్డోజర్‌ - టీడీపీ తిరువూరు ఎమ్మెల్యేపై విమర్శలు
Chandra Babu And Revanth Reddy Meeting: చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raithu Bharosa: రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
Andhra Pradesh News: వైసీపీ ఎంపీపీ ఇంటిపైకి బుల్డోజర్‌ - టీడీపీ తిరువూరు ఎమ్మెల్యేపై విమర్శలు
వైసీపీ ఎంపీపీ ఇంటిపైకి బుల్డోజర్‌ - టీడీపీ తిరువూరు ఎమ్మెల్యేపై విమర్శలు
Chandra Babu And Revanth Reddy Meeting: చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
Hathras Stampede: హత్రాస్‌లో తొక్కిసలాటకు కారణమిదే, ఆ ఒక్క తప్పు ఇన్ని ప్రాణాలు తీసింది
హత్రాస్‌లో తొక్కిసలాటకు కారణమిదే, ఆ ఒక్క తప్పు ఇన్ని ప్రాణాలు తీసింది
Kakuda Trailer: ఇది చాలా డిఫరెంట్ దెయ్యం, టైం ఇచ్చి మరీ చంపేస్తోంది- నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాకుడా‘ ట్రైలర్ చూశారా?
ఇది చాలా డిఫరెంట్ దెయ్యం, టైం ఇచ్చి మరీ చంపేస్తోంది- నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాకుడా‘ ట్రైలర్ చూశారా?
SSMB29: మహేష్ మూవీలో విలన్​గా మలయాళీ స్టార్ హీరో, జక్కన్న సెలెక్షన్స్ అదుర్స్ అంతే!
మహేష్ మూవీలో విలన్​గా మలయాళీ స్టార్ హీరో, జక్కన్న సెలెక్షన్స్ అదుర్స్ అంతే!
India Pakistan: ఛాంపియన్స్‌ ట్రోఫీపై సందిగ్ధత, పాకిస్థాన్‌ పర్యటనకు భారత్‌ వెళ్తుందా?
ఛాంపియన్స్‌ ట్రోఫీపై సందిగ్ధత, పాకిస్థాన్‌ పర్యటనకు భారత్‌ వెళ్తుందా?
Embed widget