Nani Current Crush : నాని ఫస్ట్ టైమ్ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? ఇప్పుడు ఆయన క్రష్ ఎవరో తెలుసా?
నేచురల్ స్టార్ నాని అంటే చాలా మంది అమ్మాయిలకు ఇష్టం. మరి, ఇప్పుడు ఆయనకు ఏ అమ్మాయి అంటే ఇష్టమో తెలుసా? ఆయన ఫస్ట్ టైమ్ ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలుసా?
![Nani Current Crush : నాని ఫస్ట్ టైమ్ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? ఇప్పుడు ఆయన క్రష్ ఎవరో తెలుసా? Nani reveals his current crush first crush lover Hi Nanna movie promotions Latest Telugu News Nani Current Crush : నాని ఫస్ట్ టైమ్ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? ఇప్పుడు ఆయన క్రష్ ఎవరో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/23/68a6c0ed712911675703948d026b1d241695440777129313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' మూమెంట్స్ చాలా మందికి ఉన్నాయి. అంటే... మొదటిసారి, ఓ వ్యక్తిని చూసిన వెంటనే ప్రేమలో పడిపోవడం అన్నమాట! నేచురల్ స్టార్ నాని (Nani)కి అటువంటి మూమెంట్ ఉందా? ఆయన ఫస్ట్ టైమ్ ఎవరిని చూసి ప్రేమలో పడ్డారు? ఎప్పుడు పడ్డారు? ఈ ప్రశ్నకు 'హాయ్ నాన్న' సినిమా ప్రచార కార్యక్రమాల్లో సమాధానాలు చెప్పారు.
మూడో తరగతిలో ఉన్నప్పుడు...
''ప్రేమ అంటే ఏమిటనేది ఈ మధ్య తెలిసింది. అయితే... నేను ప్రేమలో పడ్డానని మొదటిసారి అనుకున్నది మూడో తరగతిలో ఉన్నప్పుడు'' అని నాని చెప్పారు. సోనీ అనే అమ్మాయి అంటే తనకు క్రష్ ఉందని గతంలో కూడా నాని చెప్పారు. మొదటి సారి ఆమెను చూసినప్పుడు ఫ్యాన్సీ డ్రస్‌లో ఉందని, ఆ రోజు తనకు ఆకులు చుట్టి నిలబెట్టారని తెలిపారు.
కరెంట్ క్రష్ ఎవరో తెలుసా?
ఇప్పుడు నానికి ఎవరు అంటే క్రష్? ఈ ప్రశ్న అడిగితే... ''కియారా ఖన్నా'' అని నాని సమాధానం ఇచ్చారు. రాశీ ఖన్నా తెలుసు, కియారా అడ్వాణీ తెలుసు! ఈ కియారా ఖన్నా ఎవరని ఆలోచిస్తున్నారా? నాని ప్రజెంట్ సినిమా 'హాయ్ నాన్న'లో యాక్ట్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్!
''ఓ రోజు 'హాయ్ నాన్న' షూటింగులో ఉన్నప్పుడు కియారా ఖన్నా వచ్చింది. ఆ రోజు ఆ అమ్మాయికి షూటింగ్ లేదు. భలే ముద్దుగా డ్రస్ వేసుకుని వచ్చింది. నేను కనుక ఆ వయసులో ఉంటే తన మీద మనసు పారేసుకునేవాడిని. నా ఫస్ట్ క్రష్ అయ్యేది'' అని నాని చెప్పారు. అదీ సంగతి!
'హాయ్ నాన్న'లో ఎవరైనా చనిపోతారా?
'హాయ్ నాన్న' ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అని ప్రచార చిత్రాలు చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమాలో ఎవరైనా చనిపోతారా? అని అడిగితే... నాని సమాధానం దాటవేశారు. దాంతో నిజంగా ఎవరైనా చనిపోతారా? అని ప్రేక్షకుల్లో సందేహం మొదలు అయ్యింది.
Also Read : బాలకృష్ణ, రవితేజకు గట్టి పోటీ, దసరా బరిలో సిక్సర్ - 'జైలర్', 'జవాన్' సక్సెస్ రిపీట్ చేసేదెవరు?
నాని జోడీగా మృణాల్ ఠాకూర్
'హాయ్ నాన్న'లో నానికి జోడీగా ఉత్తరాది కథానాయిక మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటించనున్నారు. 'సీతా రామం' తర్వాత తెలుగులో ఆమె నటిస్తున్న రెండో చిత్రమిది. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా రూపొందుతోంది. చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!
డిసెంబర్ 21న సినిమా విడుదల
'హాయ్ నాన్న' చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి 'ఖుషి' ఫేమ్ హేషామ్ అబ్దుల్ వాహేబ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ 'సమయమా' విడుదల చేశారు. ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)