Ram - Double Ismart Movie : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!
Kavya Thapar In Double Ismart : ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'డబుల్ ఇస్మార్ట్'. ఇందులో హాట్ బ్యూటీ కావ్యా థాపర్ నటిస్తున్నారట.
![Ram - Double Ismart Movie : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ! Double Ismart heroine Kavya Thapar joins cast of Ram Pothineni Sanjay Dutt latest Telugu news Ram - Double Ismart Movie : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/22/d8b68aaa23b6ca7dc19ba9a97eca41d21695354037381313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) కథానాయకుడిగా పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'డబుల్ ఇస్మార్ట్'. బాక్సాఫీస్ బరిలో భారీ వసూళ్లు సాధించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్ ఇది. ఇందులో హీరోయిన్లు ఎవరనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం... గ్లామరస్ లేడీకి ఛాన్స్ ఇచ్చారట.
'డబుల్ ఇస్మార్ట్'లో కావ్యా థాపర్!
కావ్యా థాపర్ గుర్తు ఉన్నారా? 'ఈ మాయ పేరేమిటో' సినిమాతో తెలుగు చిత్రసీమకు కథానాయికగా పరిచయం అయ్యారు. ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ సరసన ఆ సినిమాలో నటించారు. అయితే... సంతోష్ శోభన్ 'ఏక్ మినీ కథ' ఆమెకు గుర్తింపు తెచ్చింది. ఆ సినిమాలోని ఓ పాటలో గ్లామరస్ గా నటించారు. ఆ కావ్యకు 'డబుల్ ఇస్మార్ట్'లో ఛాన్స్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
'డబుల్ ఇస్మార్ట్' కోసం ఆల్రెడీ రామ్ పోతినేని, కావ్యా థాపర్ (Kavya Thapar) మీద ఓ సాంగ్ కూడా షూట్ చేశారట. తెలుగులో ఆమెకు రెండో భారీ సినిమా ఇది. రామ్ కంటే ముందు మాస్ మహారాజా రవితేజ సరసన నటించే ఛాన్స్ అనుకున్నారు. 'ఈగల్' సినిమాలో కూడా కావ్యా థాపర్ నటిస్తున్నారు.
Also Read : 'బ్రహ్మముడి' సీరియల్ హీరో హీరోయిన్ల మానస్ నాగులపల్లి, దీపికా రంగరాజ్ మధ్య బ్రేకప్
View this post on Instagram
కొబ్బరికాయ కొట్టిన రోజే విడుదల తేదీ
'డబుల్ ఇస్మార్ట్' సినిమాను మహా శివరాత్రి సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 8న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. సినిమా ప్రారంభించిన రోజునే విడుదల తేదీ కూడా వెల్లడించారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'డబుల్ ఇస్మార్ట్'ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పని చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న చిత్రమిది. భారీ తారాగణం, ఉన్నత సాంకేతిక విలువలతో సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read : డెనిమ్ జాకెట్ బటన్స్ విప్పేసి 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ ఫోటోషూట్
'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో, రెండో షెడ్యూల్ థాయిలాండ్ (Thailand)లో చేశారు. రామ్ పోతినేనితో పాటు సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్ (Sanjay Dutt)పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. 'డబుల్ ఇస్మార్ట్'లో సంజయ్ దత్‌ను మునుపెన్నడూ చూడని అవతారంలో పూరి చూపిస్తున్నారట. రామ్ లుక్ కూడా స్టైలిష్ గా ఉంటుందని టాక్.
ఈ నెలాఖరున థియేటర్లలో 'స్కంద'
'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్ నటించిన 'రెడ్', 'ది వారియర్' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ తర్వాత మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో 'స్కంద' చేశారు. ఆ సినిమా సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలకు సిద్ధం అయ్యింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)