ఫిట్నెస్ అంటే ప్రాణమిచ్చే హీరోయిన్లలో ఈ హైదరాబాదీ అమ్మాయి ఒకరు. ఇంతకీ, ఆమె ఎవరో గుర్తు పట్టారా? ఈ అమ్మాయి పేరు సిమ్రాన్ చౌదరి. ఉత్తరాది మూలాలు ఉన్న హైదరాబాద్ అమ్మాయి. సిమ్రాన్ చౌదరి లేటెస్ట్ వర్కవుట్ ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. అవి వైరల్ అవుతున్నాయి. సిమ్రాన్ చౌదరి జీరో సైజ్ కోసం ట్రై చేస్తున్నట్లు ఉన్నారు. ఈ ఫోటో చూస్తే అలాగే ఉంది కదూ! సిమ్రాన్ చౌదరి వర్కవుట్ వీడియో! విశ్వక్ సేన్ 'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో సిమ్రాన్ చౌదరికి ప్రేక్షకుల్లో గుర్తింపు వచ్చింది. 'ఈ నగరానికి ఏమైంది' కంటే ముందు 'హమ్ తుమ్', తర్వాత 'బొంబాట్', 'పాగల్', 'చెక్', 'సెహరి' చిత్రాలు చేశారు సిమ్రాన్ చౌదరి. ఇప్పుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'మిషన్ తషాఫీ' వెబ్ సిరీస్ చేస్తున్నారు సిమ్రాన్ చౌదరి. సిమ్రాన్ చౌదరి (all images, videos courtesy : simranchoudhary / instagram)