స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. 'మీ స్కిన్ అంత క్లియర్ గా ఎలా ఉంది?' అని అడగ్గా.. ఖచ్చితంగా మీరు అనుకుంటున్నట్లు నా స్కిన్ లేదంటూ బదులిచ్చింది. మయోసైటిస్ కారణంగా స్టెరాయిడ్స్ షాట్స్ తీసుకున్నానని, దాంతో స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయని వెల్లడించింది పిగ్మెంటేషన్ (పెల్లాగ్రా అనే జబ్బులో చర్మం రంగు మారడం) వచ్చిందని, చాలా ఇబ్బందులు పడుతున్నానని సమంత తెలిపింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్పమని అడగ్గా.. ప్రస్తుతానికి ఎలాంటి ప్లాన్స్ లేవని సామ్ తెలిపింది. యాక్షన్ అంటే బాగా ఇస్తామని, తప్పకుండా ఫుల్ యాక్షన్ రోల్ చేస్తానని చెప్పింది. 'సిటాడెల్' లో ఛాలెంజింగ్ రోల్ ప్లే చేశానని తెలిపింది. 'నేను ఏదైనా సాధించగలను, పరిస్థితులేంటి ఇలా ఉన్నాయని ప్రశ్నించడం మాని, నీతి నిజాయతీలతో ముందుకు సాగుతానని పేర్కొంది. ఏదైనా సమస్య వస్తే 'నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది' అనుకోవద్దని యువతకు సలహా ఇచ్చింది. గత కొన్నాళ్లుగా మాయోసైటిస్ వ్యాధితో బాధ పడుతున్న సమంత.. చికిత్స కోసం ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. 'ఖుషి' తర్వాత పూర్తిగా తన ఆరోగ్యంపైనే శ్రద్ధ వహించాలని నిర్ణయించుకొని, సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది. తన విష్ లిస్టులో ఉన్న అన్ని ప్రదేశాలకు ట్రావెల్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పిన సామ్.. నెక్స్ట్ డెస్టినేషన్ ఆస్ట్రియా అని తెలిపింది.