టాలీవుడ్ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ తన లేటెస్ట్ ఫొటోలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇటీవల జరిగిన సైమా-2023 వేడుక కోసం ట్రెండీ కాస్ట్యూమ్స్ లో సూపర్ హాట్ గా తయారైంది శివాత్మిక. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఈవెంట్ లో ఈ ముద్దుగుమ్మ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మెరూన్ కలర్ డిజైనర్ వేర్ లో మెరిసిపోతున్న శివాత్మిక.. దుబాయ్ వేదికగా వివిధ భంగిమల్లో కెమెరాకు ఫోజులిచ్చింది. ఇప్పటి వరకూ హోమ్లీ పాత్రల్లో కనిపించిన ఈ బ్యూటీ.. తాను మోడ్రన్ లుక్ లో కూడా ఆకట్టుకోగలనని చెప్పకనే చెబుతోంది. 'మంచి అమ్మాయిలందరూ నరకానికి వెళతారు' అంటూ అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సీనియర్ యాక్టర్స్ రాజశేఖర్-జీవితల కుమార్తెగా 'దొరసాని' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. తొలి సినిమాతో విమర్శకుల ప్రసంశలు అందుకొని, 2021 లో బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా సైమా అవార్డ్ సాధించింది. 'ఆనందం విలయడం వీడు' అనే తమిళ్ సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ.. 'ఆకాశం' మూవీతో అలరించింది. 'పంచతంత్రం' 'రంగమార్తాండ' చిత్రాలతో నటిగా మంచి పేరు తెచ్చుకొని శివాత్మిక రాజశేఖర్.