సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించి నమ్రత శిరోద్కర్ నిష్టగా పూజలు చేశారు. విఘ్నేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్న వీడియోని మహేశ్ సతీమణి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 'వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా, గణపతి బప్పా మోరియా' అని పోస్ట్ పెట్టింది నమ్రత. నమ్రతతో పాటుగా పిల్లలు గౌతమ్ కృష్ణ, సితార ఘట్టమనేని కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈసారి వినాయకుడి పండక్కి మహేశ్ బాబు కూడా పూజలో పాల్గొన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఘట్టమనేని ఫ్యామిలీలో ప్రతీ ఏడాది గణపతి నవరాత్రులను వేడుకలా నిర్వహిస్తారు. మహేష్ పెద్దగా గుడులు, గోపురాలకు తిరిగినట్టు కనిపించరు కానీ.. నమ్రత మాత్రం అన్ని సంప్రదాయాలు పాటిస్తుంటారు. దేవాలయాలు సందర్శించడమే కాదు.. వ్రతాలు, నోములు చేస్తుంటారు నమ్రత.