'పఠాన్' తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన కింగ్ ఖాన్ షారూక్ ఖాన్.. 'జవాన్' మూవీతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

అట్లీ దర్శకత్వంలో షారుఖ్ డ్యూయెల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 1000 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది.

'జవాన్' అనేక సౌత్ సినిమాల మిశ్రమమని, ముఖ్యంగా 'మనీ హీస్ట్' వెబ్ సిరీస్ కి రీమేక్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

'మనీ హీస్ట్' అనేది నెట్‌ ఫ్లిక్స్ లో విశేష ఆదరణ దక్కించుకున్న స్పానిష్ క్రైమ్ డ్రామా. దీనికి ఇండియాలోనూ ఫ్యాన్స్ ఉన్నారు.

నిజానికి బాగా ఆలోచించి చూస్తే 'మనీ హీస్ట్' తో 'జవాన్' సినిమాకు కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తాయి.

'మనీ హీస్ట్' లో ప్రొఫెషర్ తన టీమ్ తో కలిసి బ్యాంకు దోపిడీలు చేసినట్లే, ఇందులో షారుక్ కూడా ఒక టీంతో హైజాక్స్ కిడ్నాపులు చేస్తాడు.

'మనీ హీస్ట్' తరహాలో షారుక్ బ్యాండేజ్ మాస్క్ తో కనిస్తాడు. రెండింటిలోనూ హోస్టేజెస్ ముఖాలకు మాస్కులు తగిలించి తప్పించుకుంటారు.

అక్కడ దొంగల్ని పట్టుకోడానికి వచ్చిన లేడీ పోలీసాఫీసర్ తో ప్రొఫెషర్ ప్రేమలో పడ్డట్టే, ఇక్కడ షారుక్ - నయన్ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు.

షారుక్ ఖాన్ ను పోలీసులు పట్టుకొని టార్చర్ చేసినట్లే, అక్కడ ప్రొఫెషర్ ని కూడా బంధించి చిత్ర హింసలు పెడతారు.

'మనీ హీస్ట్' సిరీస్ లో నైరోబి చనిపోయినట్లే, 'జవాన్' మూవీలో ప్రియమణి పాత్ర చనిపోతుంది.

రెండిట్లోనూ హీరో పాత్ర లక్ష్యం ఏంటో తెలుసుకొని హీరోయిన్స్ కూడా వారి టీమ్ లో జాయిన్ అవుతారు.

దేశంలో ఆర్థిక సంక్షోభం వస్తుందనే భయాన్ని సృష్టించి ప్రొఫెసర్ తప్పించుకుంటే, ఇక్కడ జవాన్ ఈవీఎంలు ఎత్తుకెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాడు.