గొవిందా కెరీర్‌లో అన్నీ వివాదాలే - ఇదిగో లిస్ట్ బాలీవుడ్‌లో 80, 90ల దశకంలో గోవిందా శకం నడించింది. అతడు పట్టిందల్లా బంగారమే. ఇండస్ట్రీలో ఉన్నంతకాలం పలు వివాదాలను సైతం ఎదుర్కొన్నాడు. తాజాగా రూ.1000 కోట్ల ఆన్ లైన్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా గోవిందపై కేసు నమోదైంది. అప్పట్లో రాణి ముఖర్జీతో సంబంధం పెట్టుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ దానిపై ఇద్దరూ స్పందించలేదు. ఓ షూటింగ్లో మీడియా ముందు అభిమాని పై చేయి చేసుకుని వివాదాస్పదమయ్యాడు. ఇటీవల హర్యానా వైలెన్స్ పై గోవిందా ట్వీట్ ఓ రేంజ్ లో వివాదంగా మారింది. ఓసారి బాలీవుడ్ ఇండస్ట్రీ తనపై కుట్ర పన్నిందని చెప్పాడు. దాని వల్ల ఏకంగా రూ.16 కోట్లు నష్టపోయానని అన్నాడు. అలా గోవిందా ఇరుక్కున్న అనేక వివాదాల్లో ఇవి కొన్ని అయితే, వీటిలో రూ.1000 కోట్ల స్కామ్ కేసులో ఏం జరుగుతుందో చూడాలి. Photo Credit : Govinda/Instagram