ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా రాణించిన శ్రియా.. మట్టి కుండలు చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. తన భర్త కూతురితో కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో శ్రియా సరన్ స్వయంగా తన చేతులతో మట్టి కుండలు చేస్తూ కనిపించింది. గార్జియస్ బ్యూటీ తన అందమైన చేతులతో మట్టి పిసుకుతూ మరింత అందంగా కనిపిస్తోందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 2018లో శ్రియా తన రష్యన్ ప్రియుడు ఆండ్రూ కోస్చీవ్ ను నిరాడంబరంగా వివాహం చేసుకుంది. లాక్ డౌన్ సమయంలో గర్భం దాల్చిన ఈ భామ.. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. 2001లో 'ఇష్టం' మూవీతో వెండితెరకు పరిచయమైన శ్రియా సరన్.. సీనియర్ హీరోలు, కుర్ర హీరోలందరి సరసన నటించింది. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయినా, ఒక బిడ్డకు తల్లయినా కూడా ఇప్పటికీ ఆఫర్స్ అందుకుంటోంది. నాలుగు పదుల వయసులోనూ గ్లామర్ డోస్ లో ఏమాత్రం తగ్గేదే లేదని నిరూపిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను వీడియోలను అప్లోడ్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది శ్రియా.