స్విమ్మింగ్ పూల్ లో ఆలియా భట్ - వీడియో వైరల్! 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో బాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఆలియా భట్. '2 స్టేట్స్', 'హైవే', 'భద్రినాథ్ కి దుల్హనియా', 'రాజి', 'గంగుబాయ్ కథియావాడి' వంటి సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకుంది. గత ఏడాది ' ఆర్ ఆర్ ఆర్' సినిమాతో తెలుగు వెండితెరకి హీరోయిన్గా పరిచయమైంది. 'ఆర్ ఆర్ ఆర్' లో సీతగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. రీసెంట్ గా ఓ హాలీవుడ్ మూవీ లో కూడా నటించి మెప్పించింది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి 'ఆరా' అనే ఓ పాప కూడా ఉంది. రీసెంట్ గానే 'రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని' సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అలియా భట్ స్విమ్మింగ్ పూల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాన్ని మీరూ చూసేయండి. Photo Credit : Alia Bhatt/Instagram