'జవాన్' సాంగ్ ని లైవ్ లో పాడిన అనిరుద్ - వీడియో వైరల్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా అనిరుద్ రవిచంద్రన్ పేరే వినిపిస్తోంది. రీసెంట్ గా రజినీకాంత్ 'జైలర్' సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. జైలర్ సక్సెస్ లో అనిరుద్ సాంగ్స్, బీజీయం ప్రధాన పాత్ర పోషించాయి. 'జైలర్' కి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వడంతో అనిరుద్ కి కాస్ట్లీ కారు గిఫ్ట్ గా ఇచ్చారు నిర్మాత. తాజాగా షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ అందించాడు అనిరుధ్. 'జవాన్' లో సాంగ్స్ తో పాటు అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. 'జవాన్'' హిందీ సాంగ్ ని అనిరుద్ లైవ్ లో పాడుతున్న వీడియో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Photo Credit : Anirudh/Instagram