టాలీవుడ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ ఇటీవల పవన్ కళ్యాణ్ పాటకు స్టెప్పులేసి పవర్ స్టార్ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది. 'గుడుంబా శంకర్' సినిమాలోని 'చిట్టి నడుమునే చూస్తున్నా' సాంగ్‌కి తన పెట్ డాగ్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. ప్యాంట్ మీద ప్యాంట్ వేసి తన అభిమాన హీరో పవన్ ను ఇమిటేట్ చేస్తూ చేసిన ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది ప్రియాంక. షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయిల్లో ప్రియాంక ఒకరు. 2017లో 'కలవరమాయే' అనే సినిమాతో అమ్మడు తెరంగేట్రం చేసింది. కానీ అది ఎప్పుడు రిలీజ్ అయ్యిందనేది ఎవరికీ తెలియదు. విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించిన 'టాక్సీవాలా' సినిమాతో ప్రియాంక అందరి దృష్టిలో పడింది. 'ఎస్ఆర్ కల్యాణ మండపం' 'తిమ్మరుసు' 'గమనం' లాంటి చిత్రాల్లో జవాల్కర్ నటించింది. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న 'భగవంత్ కేసరి' సినిమాలో ఒక పాత్రలో కనిపించనుందని టాక్. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ప్రియాంక.. హాట్ హాట్ ఫోటోలతో నెట్టింట సందడి చేస్తూ ఉంటుంది.