వినాయక చవితి సెలెబ్రేషన్స్, లంగా వోణిలో మెరిసిన సితార - వీడియో వైరల్! మహేష్ భార్య నమ్రతా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మహేష్, పిల్లలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసే సితార డ్యాన్స్ వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. మహేష్ వర్కౌట్స్ కు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఇటీవల వెకేషన్ కు వెళ్లినప్పుడు వాటికి సంబంధించి ఫోటోలు వీడియోలను నమ్రత అభిమానులతో పంచుకున్నారు. లంగా వోణిలో మెరిసిపోతున్న సితార వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Photo Credit : Namrata Shirodkar/Instagram