Brahmamudi Serial : 'బ్రహ్మముడి' సీరియల్ హీరో హీరోయిన్ల మానస్, దీపిక మధ్య బ్రేకప్
తెలుగులో సూపర్ హిట్ టీవీ సీరియళ్ళలో 'బ్రహ్మముడి' ఒకటి. అందులో మానస్ నాగులపల్లి, దీపికా రంగరాజ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తెలుగులో సూపర్ హిట్ టీవీ సీరియళ్లలో 'బ్రహ్మముడి' (Brahmamudi Serial) ఒకటి. అదిరిపోయేటీ ఆర్పీతో వీక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు వెళుతోంది. తెలుగు టీవీ చూసే జనాలకు ఆ సీరియల్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. అందులో మానస్ నాగులపల్లి హీరోగా నటిస్తున్నారు.
మానస్ నాగులపల్లి వెండితెర ప్రేక్షకులకు కూడా పరిచయమే. 'గ్రీన్ సిగ్నల్', 'గ్యాంగ్స్ ఆఫ్ గబ్బర్ సింగ్', 'సోడా గోలి సోడా', 'ప్రేమికుడు' తదితర తెలుగు సినిమాల్లోనూ, ఈ మధ్య హిందీలో 'ప్యార్ కుల్హాద్' అని హిందీ సినిమాలోనూ ఆయన (Maanas Nagulapalli) హీరోగా నటించారు. ఇక, 'బ్రహ్మముడి'లో దీపికా రంగరాజ్ (Deepika Rangaraj) హీరోయిన్. ఓ టీవీ షోలో వాళ్లిద్దరి మధ్య జరిగిన సీన్ వైరల్ అవుతోంది.
'బ్రహ్మముడి' హీరో హీరోయిన్ల మధ్య బ్రేకప్!
అవును... 'బ్రహ్మముడి' సీరియల్ హీరో హీరోయిన్లు మానస్ నాగులపల్లి, దీపికా రంగరాజ్ మధ్య బ్రేకప్ అయ్యింది. 'స్టార్ మా' ఛానల్ (Star Maa Channel)లో ఈ ఆదివారం ప్రసారం కానున్న 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' ప్రోమో చూస్తే ఆ విధంగా అనుకుంటారు.
'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' కార్యక్రమానికి 'బ్రహ్మముడి' నటీనటులతో పాటు 'కార్తీక దీపం' ఫేమ్ నిరుపమ్ పరిటాల, సుహాసిని, అమర్ దీప్ భార్య తేజస్వి ఇంకా కొంత మంది వచ్చారు. సింగిల్ వర్సెస్ మ్యారీడ్ థీమ్ తీసుకుని ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేశారు.
మానస్ నాగులపల్లికి ఇటీవల ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ విషయం ప్రేక్షకులకు తెలుసు. ఆ ఫోటో చూపించి అతనికి డేడికేట్ చేస్తూ దీపికా రంగరాజ్ ఓ పాట పాడుతుందని శ్రీముఖి చెప్పారు. వెంటనే ''మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది' అంటూ 'ప్రియమైన నీకు' సినిమాలో సాంగ్ పాడారు. వెంటనే నిరుపమ్ 'అరే బ్రేకప్' అంటూ అరిచారు. 'నాకు సంబంధం లేదు' అంటూ మానస్ నవ్వేశారు. అదీ సంగతి! ప్రేక్షకులకు వినోదం పంచడం కోసం దీపికా రంగరాజ్ ఆ విధంగా పాట పాడారు.
Also Read : మానస్, దీపికల 'బ్రహ్మముడి' - ఈ సీరియల్ చెబుతోన్న జీవిత సత్యాలు
మానస్ నాగులపల్లి ఎంగేజ్మెంట్ మీద శ్రీముఖి సైతం స్పందించారు. ''సింగిల్స్ అని చెప్పి వీళ్ళను తీసుకు వచ్చారు. నన్ను ఎంత మోసం చేశారు. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో (మానస్ వైపు చూపిస్తూ...) ప్రతి పూట ఇక్కడే ఉంటాడు. సోషల్ మీడియాలో సడన్ గా ఎంగేజ్మెంట్ ఫోటో చూసి 'అమ్మ నా కొడకా' అనుకున్నా'' అని శ్రీముఖి వ్యాఖ్యానించారు.
ఎన్నో గాళ్ ఫ్రెండ్? అంటూ శ్రీముఖికి పంచ్!
మానస్ నాగులపల్లికి కాబోయే భార్యకు ఆమె ఫోన్ చేశారు. 'నేను మానస్ గాళ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను' అని శ్రీముఖి అంటే... 'ఎన్నో గాళ్ ఫ్రెండ్' అంటూ అటు నుంచి రిప్లై వచ్చింది. 'నీ పేరు పక్కన ఒక్క హార్ట్ సింబల్ పెట్టాడు. అదే నా పేరు పక్కన నాలుగు హార్ట్ సింబల్స్ పెట్టాడు తెలుసా?' అంటే... 'నా చేతికి రింగ్ పెట్టాడు' అంటూ మానస్ చేసుకోబోయే అమ్మాయి రిప్లై ఇచ్చారు. దాంతో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు.
Also Read : మోసాన్ని సహించలేడు, ఇబ్బంది పడితే తట్టుకోలేడు - ఇదీ 'బ్రహ్మముడి'లో రాజ్ క్యారెక్టరైజేషన్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial