అన్వేషించండి

Suriya: షూటింగ్ సెట్‌లో సూర్యకు గాయాలు - క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Hero Suriya: ‘కంగువా’ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సూర్య.. తన అప్‌కమింగ్ మూవీ సెట్‌లో అడుగుపెట్టాడు. మొదటి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న తర్వాత రెండో షెడ్యూల్‌లో జరిగిన ఘటన వల్ల షూటింగ్‌కు బ్రేక్ పడింది.

Hero Suriya Injured: సినిమా సెట్‌లో ఎంత జాగ్రత్తగా ఉన్నా అప్పుడప్పుడు ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. తాజాగా తన సినిమా షూటింగ్ సెట్‌లో సూర్యకు గాయాలయ్యాయి అనే వార్త తన ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. ‘కంగువా’ షూటింగ్ పూర్తికావడంతో కార్తిక్ సుబ్బరాజ్‌తో తాను చేస్తున్న ‘సూర్య 44’ షూటింగ్‌కు షిఫ్ట్ అయ్యాడు ఈ హీరో. ఈ మూవీ షూటింగ్ సెట్‌లో సూర్యకు గాయాలు అయ్యాయనే వార్త తాజాగా బయటికొచ్చింది. దీంతో ఫ్యాన్స్ అంతా కంగారుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి నిర్మాత ముందుకొచ్చారు.

నిర్మాత క్లారిటీ..

కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమాను రాజశేఖర్ పాండియన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ సెట్‌లో హీరోకు గాయాలంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ‘డియర్ సూర్య ఫ్యాన్స్. ఇదొక చిన్న గాయం మాత్రమే. కంగారుపడకండి. మీ ప్రేమ, ఆశీస్సులతో సూర్య అన్న బాగున్నాడు’ అని క్లారిటీ ఇచ్చారు రాజశేఖర్ పాండియన్. దీంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరిపీల్చుకున్నాడు. త్వరగా కోలుకోమంటూ సూర్యను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. హీరోకు గాయాలు అవ్వడంతో కొన్నిరోజుల పాటు మూవీ షూటింగ్‌కు బ్రేక్ పడనుందని సమాచారం.

రెండో షెడ్యూల్‌కు బ్రేక్..

సూర్యకు తగిన గాయానికి చికిత్స కోసం తనను ఊటీలోని ఒక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకున్న తర్వాత కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోమని సూర్యకు డాక్టర్లు సూచించినట్టు సమాచారం. అందుకే షూటింగ్‌కు బ్రేక్ పడక తప్పదని తెలుస్తోంది. ఇప్పటికే ‘సూర్య 44’కు సంబంధించి ఒక షెడ్యూల్ పూర్తయ్యింది. రెండో షెడ్యూల్.. తాజాగా ఊటీలో ప్రారంభమయ్యింది. అంతా బాగుంది అనుకునే సమయానికి సూర్యకు గాయం అవ్వడంతో శరవేగంగా సాగుతున్న ఈ మూవీ షూటింగ్‌కు బ్రేక్ పడింది. సూర్య, కార్తిక్ సుబ్బరాజు కాంబినేషన్ గురించి ప్రకటన రాగానే ఫ్యాన్స్ అంతా చాలా ఎగ్జైట్ అయ్యారు.

‘కంగువా’తో సిద్ధం..

ప్రస్తుతం సూర్య.. తన అప్‌కమింగ్ ప్యాన్ ఇండియా మూవీ ‘కంగువా’ రిలీజ్ కోసం కూడా ఎదురుచూస్తున్నాడు. చాలాకాలం నుండి ఈ మూవీ షూటింగ్‌కే తన కాల్ షీట్స్‌ను కేటాయించాడు సూర్య. ఇక ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్‌లో అడుగుపెట్టడంతో ‘సూర్య 44’కు షిఫ్ట్ అయ్యాడు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన పోస్టర్లు.. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి. ఇందులో సూర్యను ఎదిరించే ధీటైన విలన్‌గా ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ కనిపించనున్నాడు. సౌత్‌లో ‘కంగువా’తో ఎంట్రీ ఇవ్వనున్నాడు ఈ బాలీవుడ్ నటుడు.

Also Read: సైలెంట్‌గా ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌ మూవీ ప్రారంభోత్సవం - అప్పుడే రిలీజ్ డేట్ కూడా లాక్, ఎప్పుడంటే..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Royal Enfield Retro Bike: రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మురళి కృష్ణుడి అలంకారంలో  శ్రీప‌ద్మావ‌తి అమ్మవారునర్సుపై కొడవలితో దాడి, లవర్ పనే..! సీసీటీవీ వీడియోఊరి మీద విరుచుకుపడి ప్రాణాలు తీసేసిన పెద్దపులిISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Royal Enfield Retro Bike: రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
iPhone 17 Pro Max: కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Embed widget