Chhaava First Review: 'ఛావా' ఫస్ట్ రివ్యూ - నేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్‌లో భారీ హిట్టు కొట్టిందా?
Vicky Kaushal's Chhaava Review: విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన తాజా చిత్రం 'ఛావా' శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. పీరియాడిక్ డ్రామా ఎలా ఉందంటే..

Chhaava First Review: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal), నేషనల్ క్రష్ రష్మిక (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఛావా' (Chhaava). ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను తెరకెక్కించగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. శంభాజీ భార్య యేసుబాయిగా నేషనల్ క్రష్ రష్మిక నటించారు. భారీ బడ్జెట్‌తో దినేశ్ విజన్ నిర్మించగా.. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి. మరి శంభాజీగా విక్కీకౌశల్, యేసుబాయిగా రష్మిక మెప్పిస్తారా.? బాలీవుడ్‌లో నేషనల్ క్రష్ హిట్టు కొడుతుందా.? అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో 'ఛావా' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ (Tarann Adarsh) సోషల్ మీడియా వేదికగా 'ఛావా' (Chhaava) ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. ఈ సినిమా ఓ అద్భుతమని ప్రశంసిస్తూ 4.5 రేటింగ్ ఇచ్చారు. చరిత్ర, భావోద్వేగాలు, దేశభక్తి ఇలా అన్నింటినీ మిక్స్ చేసి బ్లాక్ బస్టర్‌గా సినిమా ఉందని చెప్పారు. విభిన్న ఇతి వృత్తాలను ఎంచుకోవడంలో పేరుగాంచిన దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ శంభాజీ మహరాజ్ స్ఫూర్తిదాయకమైన కథకు ప్రాణం పోశారని.. మొదటి ఫ్రేమ్ నుంచే పీరియాడిక్ సినిమాటిక్ దృశ్యాన్ని తెరకెక్కించారని రివ్యూలో తరణ్ పేర్కొన్నారు.
శంభాజీ మహరాజ్‌గా మెప్పించిన విక్కీ
#OneWordReview...#Chhaava: SPECTACULAR.
— taran adarsh (@taran_adarsh) February 13, 2025
Rating: ⭐️⭐️⭐️⭐️½
Blends history, emotions, passion, patriotism, action with finesse... #VickyKaushal terrific, cements his stature as one of the finest actors of his generation... #LaxmanUtekar triumphs as a storyteller. #ChhaavaReview… pic.twitter.com/hK2iLBeMkz
ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ (Vicky Kaushal) నటన అద్భుతమని తరణ్ ఆదర్శ్ ప్రశంసించారు. విక్కీ కమాండింగ్ ప్రెజెన్స్, సీరింగ్ ఇంటెన్సిటీ, ఎమోషనల్ డైలాగ్స్ సినిమాను ఓ కొత్త స్థాయికి ఎలివేట్ చేశాయన్నారు. అక్షయ్ కన్నాతో జరిగిన యుద్ధ సన్నివేశాలు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లినట్లు చెప్పారు.
నేషనల్ క్రష్ రష్మిక కెరీర్‌లోనే..
నేషనల్ క్రష్ 'రష్మిక మందన్నా' (Rashmika Mandanna) నటన అద్భుతంగా ఉందని.. పీరియాడిక్ డ్రామా కథనానికి అనుగుణంగా తన అందం, అభినయం, గ్రేస్‌తో ఎమోషనల్ వెయిట్ తీసుకొచ్చినట్లు తరణ్ పేర్కొన్నారు. అమె నటించిన చిత్రాల్లో ది బెస్ట్ హిస్టారికల్ మూవీ అని రివ్యూలో చెప్పారు. అటు, ఔరంగజేబ్‌గా అక్షయ్ కన్నా అద్భుతమైన నటనతో మెప్పించారని అన్నారు. మూవీలో యుద్ధ సన్నివేశాలు, రాజ భవనాల విజువల్స్ అద్భుతంగా తెరకెక్కించినట్లు చెప్పారు.
'ఛావా'లో ఏఆర్ రెహమాన్ (AR Rehman) సంగీతం గూస్ బంప్స్ అంటూ తరణ్ రివ్యూలో పేర్కొన్నారు. ద్వితీయార్థంలో బీజీఎం అద్భుతమని చెప్పారు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ టైంలో మ్యూజిక్ గుర్తుండిపోతుందన్నారు. ఫైనల్‌గా ఛావా 'ఓ అద్భుత విజయం' అంటూ రివ్యూలో స్పష్టం చేశారు. ఈ సినిమా చరిత్రకు న్యాయం చేసిందని.. ప్రేక్షకుడిని గర్వపడేలా చేస్తుందని చెప్పారు. సినిమాను మిస్ కావొద్దని పేర్కొన్నారు.
Also Read: 'రానా నాయుడు 2'పై రానా కీలక అప్ డేట్ - ట్రైలర్, స్ట్రీమింగ్ డేట్స్‌పై కీలక వ్యాఖ్యలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

