అన్వేషించండి

Rana Naidu 2: 'రానా నాయుడు 2'పై రానా కీలక అప్ డేట్ - ట్రైలర్, స్ట్రీమింగ్ డేట్స్‌పై కీలక వ్యాఖ్యలు

Daggubati Rana: 'రానా నాయుడు 2' వెబ్ సిరీస్‌పై నటుడు రానా కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ సిరీస్ ట్రైలర్ సిద్ధమైందని.. అతి త్వరలోనే స్ట్రీమింగ్‌కు సైతం వస్తుందని చెప్పారు.

Rana Gives Update About 'Rana Naidu 2' Trailer And Streaming Date: టాలీవుడ్ టాప్ హీరోస్ విక్టరీ వెంకటేశ్, రానా కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు' (Rana Naidu). గతంలో ఓటీటీ ప్లాట్ ఫాం 'నెట్ ఫ్లిక్స్'లో విడుదలై విజయం సాధించిన ఈ సిరీస్‌కు సీక్వెల్ రానా నాయుడు 2' (Rana Naidu) రాబోతోంది. ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సిరీస్‌ ట్రైలర్, స్ట్రీమింగ్ డేట్స్‌పై దగ్గుబాటి రానా తాజాగా కీలక అప్ డేట్ ఇచ్చారు. తాజాగా, ఆయన నిర్మించిన 'ఇట్స్ కాంప్లికేటెడ్' సినిమా ఈవెంట్లో దీనిపై మాట్లాడారు. 'రానా నాయుడు 2' వెబ్ సిరీస్ ట్రైలర్ సిద్ధమైందని.. విడుదల తేదీ సైతం ఖరారైనట్లు తెలిపారు. అతి త్వరలోని సిరీస్ స్ట్రీమింగ్‌కు వస్తుందన్నారు. ఇక ఇదే ఈవెంట్లో వెంకీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. 'నువ్వు నాకు నచ్చావ్' రీ రిలీజ్‌పైనా స్పందించారు. ఆ మూవీ యూనిట్‌తో మాట్లాడి ఆ సినిమాను రీరిలీజ్ చేస్తామన్నారు.

కాగా, గతేడాది జులైలో 'రానా నాాయుడు 2' షూటింగ్ ప్రారంభమైంది. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌కు విశేష ప్రేక్షకాదరణ లభించిందని నెట్ ఫ్లిక్స్ బృందం గతంలో తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సీజన్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు పేర్కొంది. 'రానా నాయుడు' సిరీస్ కంటే ఎన్నో ట్విస్టులు, మరింత ఫ్యామిలీ డ్రామాతో 'రానా నాయుడు 2'ను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించింది. ఇటీవల టీజర్ విడుదల చేయగా ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో నటనకు గానూ రానా 'ఇండియన్ టెలీ అవార్డు 2024'లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. 

Also Read: అనుపమతో ప్రదీప్ 'డ్రాగన్'... 'లవ్ టుడే' రేంజ్ సక్సెస్ రిపీట్ చేస్తాడా? రన్ టైమ్, సెన్సార్ టాక్ నుంచి ఓటీటీ డీల్ వరకు - ఈ విషయాలు తెల్సా?

విమర్శలను ఎదుర్కొన్న 'రానా నాయుడు'

అమెరికన్ టీవీ సిరీస్ 'రే డొనొవాస్'ను స్ఫూర్తిగా తీసుకుని ఇండియన్ ఆడియన్స్‌‌ను మెప్పించేలా 'రానా నాయుడు' సిరీస్‌ను కరన్ హన్షుమాన్ తీర్చిదిద్దారు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో హిందీ, తెలుగుతో పాటు ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, స్పానిష్ భాషల్లో గతేడాది మార్చి 10వ తేదీన అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లీష్, హిందీ సబ్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అయ్యింది. క్రైమ్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌కు హిట్ టాక్ వచ్చినా అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో విమర్శలు ఎదుర్కొంది. రానా - వెంకీ నుంచి ఇలాంటి సిరీస్ ఊహించలేదని.. ఫ్యామిలీతో కలిసి చూడలేమంటూ ట్రోల్స్ నడిచాయి.

అయితే, విడుదలైన తొలి 2 రోజుల్లోనే భారత్ టాప్ ట్రెండింగ్ షోల్లో ఈ సిరీస్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. అటు, ఈ ట్రోల్స్‌పై అప్పట్లోనే వెంకీ, రానా క్షమాపణ చెప్పారు. కుటుంబంతో కలిసి సిరీస్ చూడొద్దని.. ఇది 'ఏ' రేటెడ్ సిరీస్ అని, 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమేనని స్పష్టం చేశారు. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ గ్లోబల్ స్థాయిలో ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకున్న వాటిలో ఈ సిరీస్ టాప్‌లో నిలిచింది. అంతే స్థాయిలో 'రానా నాయుడు 2' సైతం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండో సీజన్‌లో రానా నాయుడు ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేశాడు.? తన ఫ్యామిలీని రక్షించుకునేందుకు రానా నాయుడు ఏం చేశారు.? గతంలో చేసిన పనుల వల్ల ఏర్పడిన కొత్త సమస్యలు ఏంటనే అంశాలు ఇందులో ఉంటాయి.

Also Read: సామాన్యులతో సామాన్యుడిగా మెట్రోలో కన్నడ స్టార్ హీరో 'సుదీప్' - సెల్ఫీలు దిగేందుకు పోటీ పడిన అభిమానులు, ఫోటోలు వైరల్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
New Kia Seltos: అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
Dhandoraa OTT : ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Unbreakable Cricket Records : క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
Embed widget