Dhandoraa OTT : ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Dhandoraa OTT Platform : లేటెస్ట్ సోషల్ డ్రామా 'దండోరా' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. థియేట్రికల్ రన్ పూర్తైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

Sivaji's Dhandoraa Movie OTT Platform Locked : సీనియర్ హీరో శివాజీ, బిందు మాధవి, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సోషల్ డ్రామా 'దండోరా'. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు అందరి దృష్టి ఓటీటీపై పడింది.
ఆ ఓటీటీలోకే స్ట్రీమింగ్
ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకోగా థియేట్రికల్ రన్ తర్వాత అందులోనే స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా ఏ మూవీ అయినా థియేటర్లో రిలీజ్ అయిన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. ఈ మూవీ కూడా వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో ఓటీటీలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీకి మురళీకాంత్ దర్శకత్వం వహించగా... లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర రెడ్డి నిర్మించారు. శివాజీ, బిందు మాధవి, నవదీప్‌లతో పాటు రవికృష్ణ, నందు, మాణికా శ్రీ, మౌనికా రెడ్డి, అదితి భావరాజు కీలక పాత్రలు పోషించారు. సామాజిక అంశాలు, గ్రామీణ నేపథ్యం, కుల వివక్ష అంశాలే ప్రధానాంశంగా ఈ మూవీని తెరకెక్కించారు.
Also Read : 'మీరు అసూయ పడుతూనే ఉండండి' - అందరికీ ఇదే నా రిక్వెస్ట్... అనసూయ వరుస ట్వీట్స్
స్టోరీ ఏంటంటే?
తెలంగాణలోని మారుమూల పల్లెటూరు తుళ్లూరులో కుల వివక్ష ఉంటుంది. గ్రామంలో తక్కువ కులానికి చెందిన ఎవరైనా మరణిస్తే ఊరు చివర బ్రిడ్జ్ వద్దకు తీసుకెళ్లి అక్కడ నుంచి కిందకు దించి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. అగ్ర కులానికి చెందిన రైతు శివాజీ (శివాజీ) కూడా వివక్షకు గురవుతాడు. కన్న కొడుకు విష్ణు (నందు)తోనూ ఆయనకు మాటలుండవు. శివాజీ మరణిస్తే కుల సంఘానికి చెందిన స్మశాన వాటికలో దహనం చేసేందుకు వీల్లేదని కులపెద్దలు నిర్ణయిస్తారు.
అసలు అగ్ర కులానికి చెందిన శివాజీని కుల పెద్దలు ఎందుకు బహిష్కరించారు? ఆ ఊరిలో తక్కువ కులానికి చెందిన రవి (రవికృష్ణ) హత్యకు గురైన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? శివాజీ అంతిమ సంస్కారాల విషయంలో వివాదంపై ఊరి పెద్దలు, సర్పంచ్ (నవదీప్) ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? వేశ్య శ్రీలత (బిందు మాధవి)తో శివాజీకి ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.






















