Anasuya Bharadwaj : 'మీరు అసూయ పడుతూనే ఉండండి' - అందరికీ ఇదే నా రిక్వెస్ట్... అనసూయ వరుస ట్వీట్స్
Anasuya Reaction : హీరోయిన్లపై కామెంట్స్ వివాదం హాట్ టాపిక్‌గా మారిన వేళ యాంకర్ అనసూయ వరుస ట్వీట్స్ చేశారు. శివాజీ కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఆమె తాజాగా వరుస పోస్టులు పెట్టారు.

Anasuya Bharadwaj Tweets On Sivaji Comments : హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై నటుడు శివాజీ కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన వేళ ఆయన క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. అపాలజీ చెబుతూనే నటి, యాంకర్ అనసూయకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీనిపై ఆమె రియాక్ట్ అవుతూ వీడియో సైతం రిలీజ్ చేశారు. తాజాగా వరుసగా ట్వీట్స్ చేస్తుండగా వైరల్ అవుతున్నాయి.
'అందరికీ నా రిక్వెస్ట్'
కొంతమంది పురుషుపు, ఇంకా కొంతమంది మహిళలు కూడా నన్ను తక్కువగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు అనసూయ. 'ఈ విధమైన ఆలోచన కలిగిన వారు ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు. ఇది మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం వల్ల.. అలాగే బలహీనమైన పితృస్వామ్య అహంకారాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో జరుగుతుంది. ఇది అందరి గురించీ కాదు.
కానీ నేను పురుషులు.. మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి విస్తృతంగా ఆలోచించండి. పాత తరాలు నేర్చుకున్నవి లేదా అలవాటు పడ్డ ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మనం మార్పును ఎంచుకోవచ్చు.. మన గౌరవాన్ని.. మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చు.. ఒకరికొకరం శక్తినివ్వాలి.. మద్దతుగా నిలవాలి.. మన విలువ మన సెలక్షన్స్ నుంచే వస్తుంది. మీడియా కూడా బాధ్యతతో వ్యవహరించాలి.' అని ట్వీట్ చేశారు.
'అసూయ పడుతూనే ఉండండి'
తాను ఎన్నో ఇబ్బందులు దాటుకుని వచ్చానని... ఓ విషయంలోనైనా బాధ పడకుండా బలంగా ముందుకు సాగుతానని అన్నారు అనసూయ. 'ప్రస్తుతం జరుగుతుంది పక్కన పెడితే నేను నా అభిప్రాయాన్ని ఏ విషయంలోనైనా బలంగా వినిపిస్తా. దేనికీ ప్రభావితం కాకుండా ధైర్యంగా నిలబడతాను. ఎన్నో ఏళ్ల నుంచి సమాజంలో నిర్లక్ష్యం చేసిన అంశాన్ని అర్థమయ్యేలా చెప్పి, దానిపై పోరాడాలనేదే నా ఉద్దేశం. ఏం జరిగినా నేను చెప్పింది చేయడానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటాను. మీరు అసూయ పడుతూనే ఉండండి. మేము మరింత శక్తిమంతంగా మారతాం.' అని అన్నారు.
Also.. regardless of everything that is happening and unfolding.. I will always stand tall.. unbothered.. unaffected.. untouched..and strong .. this entire interaction is solely about representing a section of society that has long been unheard and overlooked..
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 25, 2025
At the end of the…
'చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే'
ఈ రోజుకి ఇంకొకటి చెప్పాలంటూ లేటెస్ట్‌గా మరో ట్వీట్ చేశారు అనసూయ. 'ఉన్న ఇష్యూని అడ్రస్ చేయడం చేతకాక నన్ను కొందరు ఆంటీ అంటున్నారు. ఆయన్ను మాత్రం గారు అంటున్నారు. నాకు 40, ఆయనకు 54 అనుకుంటా. అయినా ఇద్దరం చక్కగా మా ప్రొఫెషన్ కోసం ఫిట్ నెస్ మెయింటెన్ చేస్తున్నాం. ఈ కామెంట్ చేసే వారందరూ నిత్య యవ్వనులు. అది వేరే విషయం. ఇంక ఇంత కంటే ఏం చెప్పినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే. హ్యాపీ క్రిస్మస్' అంటూ ట్వీట్ చేశారు.
Inkokkati last chepta eerojuki.. unna issue ni address cheyatam chaatakaka nannu age shame chestu aunty antunna men and women.. aayanni maatram garu antunnaru.. kani nenu hypocrite ni aipoyanu 😄 naku 40.. aayanaki 54 anukunta.. aina iddaram chakkaga ma profession kosamo personal…
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 25, 2025
'మీ రుణం తీర్చుకుంటా' అంటూ అనసూయపై శివాజీ సెటైరికల్ కామెంట్స్ చేయగా ఆమె స్పందించారు. మీలాంటి వాళ్ల సపోర్ట్ తనకు అవసరం లేదంటూ చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా వరుస ట్వీట్స్ చేశారు.






















