నా మాట వినండి..

పెళ్లైన అమ్మాయిలకి అనసూయ పాఠాలు!

ఈ అందం వెనుక

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ లేటెస్ట్ గా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో షేర్ చేసింది

#YouAreStrongerThanYouThink 💪🏻❤️

పెళ్లైన మహిళలను ఉద్దేశించి అనసూయ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది

తీరికలేకుండా..

పిల్లల పని, భర్త పని అవగానే అత్తమామలకు టిఫిన్ పెట్టాలి, ఇంటి పనులతో బీజీ బిజీగా మారిపోతారు

ఉద్యోగస్తుల పరిస్థితి మరీ దారుణం

ఇంటిపనితో పాటూ ఉద్యోగం చేసే మహిళలకు అయిన క్షణం కూడా తీరిక ఉండదు..కానీ

టైమేది అనేస్తారు?

ఎప్పుడూ ఇంటిపైనే కాదు కాస్త ఒంటిపై కూడా ధ్యాస పెట్టి వ్యాయామం చేయమని ఎవరైనా చెబితే టైమ్ ఏది అంటుంటారు

ఆలస్యం అయింది కానీ..

బై బర్త్ ఇలానే ఉన్నా నేను ఎప్పుడూ జిమ్ కి వెళ్లలేదని చెప్పిన నేనే ఇప్పుడు అర్థం చేసుకున్నాను

లగ్జరీ కాదు కనీస అవసరం

మీరు భారీ వర్కౌట్స్ చేయొద్దు కానీ మీ ఆరోగ్యంపై మీకు శ్రద్ధ అవసరం.

నా మాట నమ్మండి

అమ్మాయిలూ, అమ్మలూ..ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది అని చిన్న క్లాస్ వేసింది

మీకోసం మీరు...

రోజుకో గంట కేటాయిస్తే చాలు కొన్ని వారాల్లోనే మార్పు చూస్తారు..మీకు మీరే కృతజ్ఞతలు చెప్పుకుంటారని పోస్ట్ పెట్టింది