Dragon: అనుపమతో ప్రదీప్ 'డ్రాగన్'... 'లవ్ టుడే' రేంజ్ సక్సెస్ రిపీట్ చేస్తాడా? రన్ టైమ్, సెన్సార్ టాక్ నుంచి ఓటీటీ డీల్ వరకు - ఈ విషయాలు తెల్సా?
Pradeep Ranganathan: 'లవ్ టుడే' ఫేం ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ మూవీ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల మూవీ ట్రైలర్ స్పెషల్ బజ్ క్రియేట్ చేసింది.

Pradeep Ranganathan's Dragon Will Release On 21st February: 'లవ్ టుడే' ఫేం ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' (Return Of The Dragon). ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేయగా ఈ నెల 21న థియేటర్లలోకి రానుంది. అనుపమ పరమేశ్వరన్, కయదు లోహర్, జార్జ్ మరియన్, ఇందుమతి మణికందన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, స్నేహ, మిస్కిన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మించారు. యూత్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తుండగా.. స్పెషల్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే అనౌన్స్‌మెంట్ వీడియో, టీజర్, పాటలు సినిమాపై భారీ హైప్‌ను పెంచేశాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన AGS ఎంటర్‌టైన్‌మెంట్ ఈ మూవీని నిర్మిస్తుండగా.. ఇంజినీరింగ్‌లో 48 బ్యాక్‌లాగ్‌లు పెట్టుకున్న హీరో.. కాలేజీలో పనీ పాటా లేనీ గాలికి తిరిగే ఓ కుర్రాడిగా కనిపించాడు. ప్రేమ, బ్రేకప్, లైఫ్‌లో సెటిల్ అవ్వడం కోసం కష్టపడే తీరు, ఫ్యామిలీ ఎమోషన్ ఇలా అన్నీ కూడా ట్రైలర్‌లో చూపించారు. బాధ్యతారాహిత్యంగా ఉండే కుర్రాడి జీవితంలో వచ్చే సమస్యలు, సవాళ్లను చూపిస్తూనే.. యుత్ ఎంటర్‌టైనర్‌గా రూపొందినట్లు ట్రైలర్‌ను చూస్తేనే తెలుస్తోంది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించారు.
Also Read: 'కింగ్‌డమ్'పై నేషనల్ క్రష్ స్పెషల్ పోస్ట్... రష్మికకు దేవరకొండ పెట్టిన ముద్దు పేరు ఏంటో తెలుసా?
CBFC.. UA సర్టిఫికెట్
'డ్రాగన్' చిత్రానికి సెన్సార్ బోర్డు 'UA' సర్టిఫికెట్ ఇచ్చింది. అధికారికంగా 2 గంటల 35 నిమిషాల రన్ టైం కలిగి ఉంది. ఈ మేరకు చిత్ర బృందం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, AGS ఎంటర్‌టైన్‌మెంట్, ప్రదీప్ రంగనాథన్ కాంబోలో వచ్చిన 'లవ్ టుడే' మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే కాంబోలో 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' వస్తుండడంతో అంచనాలు నెలకొన్నాయి. అటు, దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలుగులో 'ఓరి దేవుడా'తో గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ ఓటీటీలోకి 4 భాషల్లో..
When desperation meets deceit, Dragon takes flight! 🔥
— Netflix India South (@Netflix_INSouth) January 15, 2025
Dragon, coming to Netflix in Tamil, Telugu, Malayalam, and Kannada, after its theatrical release!#NetflixPandigai pic.twitter.com/bPfD2DcpaL
'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీలోకి రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'నెట్ ఫ్లిక్స్'లో (Netflix) స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొంది. 'వైరాగ్యం కలిస్తే, డ్రాగన్ ఎగిరిపోతుంది! డ్రాగన్, థియేటర్‌లలో విడుదలైన తర్వాత తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌కి వస్తోంది!' అని పేర్కొంది. కాగా, నటుడు ప్రదీప్ రంగనాథన్ 'లవ్ టుడే'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ సినిమా తర్వాత విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK) సినిమాలో నటిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీలో కృతి శెట్టి ప్రధాన పాత్రలో నటించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

