Ananya Nagalla: మాకూ హార్ట్ ఉంది... రెస్పెక్ట్ ఇవ్వండి - ఫీమేల్ జర్నలిస్టుకు అనన్య నాగళ్ల ఇన్‌డైరెక్ట్ కౌంటర్?
ఫీమేల్ ఆర్టిస్టులకు రెస్పెక్ట్ ఇవ్వాలని నటి అనన్య నాగళ్ల రిక్వెస్ట్ చేసింది. తమకు హార్ట్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదన్నారు.
Ananya Nagalla About Lady Journalist Questions: యంగ్ హీరో యువ చంద్ర కృష్ణ, అచ్చ తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ల జంటగా నటించిన చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న అనన్య నాగళ్ల, సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న ఫీమేల్ ఆర్టిస్టులను, హీరోయిన్లకు రెస్పెక్ట్ ఇవ్వాలని కోరింది. “ఫీమేల్ ఆర్టిస్టులు అనగానే, ఎప్పుడూ మేకప్ వేసుకుంటారు. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. వాళ్లుకు హార్ట్ ఉండదు. ఫ్యామిలీ మెంబర్స్ ఉండరని కాదు. వాళ్లకూ రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుతున్నాను” అని చెప్పుకొచ్చింది. రీసెంట్ గా ఓ లేడీ జర్నలిస్టు అనన్యను క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇబ్బంది పెట్టేలా ప్రశ్నలు అడిగింది. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
లేడీ జర్నలిస్టు ప్రశ్నకు ఇండైరెక్ట్ కౌంటర్
‘పొట్టేల్’ సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఓ న్యూస్ ఛానల్‌కు చెందిన ఫీమేల్ జర్నలిస్టు అనన్యను ఇబ్బంది పెట్టేలా ప్రశ్నలు వేసింది. “తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలంటేనే భయపడతారు. ఆఫర్లు రావాలంటే కమిట్మెంట్ అడుగుతారనే ప్రచారం ఉంది. మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా?” అని ప్రశ్నించింది. “మీకు ఎలా తెలుసు?” అని అనన్య ఎదురు ప్రశ్న వేసింది. “నాకు మా ఫ్రెండ్స్ చెప్పారు. మీరు చేసే అగ్రిమెంట్లలో కూడా అది ఉంటుందట కదా?” అని మళ్లీ ప్రశ్నించింది. “ఎక్కడైనా పాజిటివ్, నెగెటివ్ అనేవి ఉంటాయి. మీరు అనుకునేది పూర్తిగా తప్పు. నటిగా నాకు ఏనాడు క్యాస్టింగ్ కౌచ్ ఎదురు కాలేదు” అని వివరించింది. అయినప్పటికీ సదరు జర్నలిస్టు “కమిట్మెంట్ ను బట్టి రెమ్యునరేషన్ ఉంటుందని టాక్ ఉంది. మీరేమంటారు?” అని మరో క్వశ్చన్ వేయడంతో “నేను ఈ ఫీల్డ్ లోనే ఉన్నాను. ఇక్కడ అలాంటివి ఏమీ లేవు” అంటూ ఘాటుగా స్పందించింది అనన్య. లేడీ ప్రశ్నలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. నెటిజన్లు లేడీ జర్నలిస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్లు అనగానే ఎలా పడితే అలా ప్రశ్నలు అడగడం ఫ్యాషన్ అయ్యిందని మండిపడ్డారు.
ఫిలిం ఛాంబర్ సీరియస్
అటు ఫీమేల్ జర్నలిస్టు ప్రశ్నలు అడిగిన విధానంపై ఫిలిం ఛాంబర్ సీరియస్ అయ్యింది. జర్నలిస్టు సంఘానికి లేఖ రాసింది. ఇలాంటి జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని కోరింది. “లేడీ జర్నలిస్టుకు క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎలా తెలిసింది. ఒకవేళ ఆమె దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఫిలిం ఛాంబర్ కు ఇవ్వాలి. విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం. ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఆమెపై చర్యలు తీసుకోవాలి” అని ఫిలిం ఛాంబర్ డింమాండ్ చేసింది.
‘పొట్టేల్’ సినిమా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చాటి చెప్పడంతో పాటు సామాజిక అంశాలను బేస్ చేసుకుని తెరకెక్కించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఓ పాప చదువు చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందన్నారు. ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటి వరకు రాలేదని అనన్య చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో బుజ్జమ్మ అనే పాత్ర పోషించినట్లు చెప్పింది. ఇకపై తనను అందరూ అనన్య అని కాకుండా బుజ్జమ్మ అని పిలుస్తారని చెప్పింది. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే ఈ సినిమాను నిర్మించారు.
Read Also: 'కంగువా' ఫస్ట్ హాఫ్‌పై ప్రొడ్యూసర్ క్రేజీ కామెంట్స్, ‘బాహుబలి’ రికార్డులు బద్దలవుతాయా?