అన్వేషించండి

Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే

Karnataka: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది. ముడా భూముల స్కాంలో గతంలో లోకాయుక్తనే విచారణకు ఆదేశించింది.

Karnataka CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రికి కొద్ది రోజులుగా పెను సమస్యగా ఉన్న మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ భూముల కేసులో ఊరట లభించింది. ఆ వ్యవహారంలో సిద్దరామయ్య తప్పు చేశారనడానికి.. అవినీతి చేశారనడానికి ఆధారాల్లేవని తాజాగా తేల్చింది. గతంలో ఇదే కేసులో  సిద్ధరామయ్య విచారణకు లోకాయుక్త ఆదేశించింది. ఆ సమయంలో రాజకీయ దుమారం రేగింది. ఈడీ కూడా రంగంలోకి దిగి కేసు పెట్టింది. అయితే చివరికి కేసులో ఏమీ లేదని తేలిపోవడంతో సిద్దరామయ్య ఊపిరి  పీల్చుకున్నారు. ఓ సందర్భంలో ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపించాయి. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆయనను తప్పించాలని అనుకుందని చెప్పుకున్నారు. కానీ అన్నింటినీ అధిగమించి ఆయన బయటపడ్డారు.

ముడా స్కాం ఏమిటంటే ?                

 మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ రెసిడెన్షియల్ లే ఔట్స్ వేసింది. దీని కోసం భూములు సేకరించింది. ఈ భూముల్లో సీఎం సిద్ధరామయ్య సతీమణి నుంచి భూములు తీసుకుంది. అయితే తక్కువ విలవైన భూములు తీసుకుని  ప్రత్యామ్నాయంగా మైసూరులో విలువైన భూములు కేటాయించిందన్న ఆరోపణలు వచ్చాయి.  ఆమె నుంచి 3 ఎకరాల భూమిని తీసుకుని 50:50 రేషియో కింద ప్లాట్లను ముడా కేటాయించింది.   దీనిపై లోకాయుక్త, ఈడీ ఏకకాలంలో విచారణ జరిపాయి.  ఈ వ్యవహారంలో సిద్ధరామయ్య భార్యకు కూడా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.   లోకాయుక్త కోర్టు   తన నివేదికను కర్ణాటక హైకోర్టుకు సమర్పించింది. 

ఈడీ కూడా క్లీన్ చిట్ ఇస్తుందా ?                 

లోకాయుక్త క్లీన్ చిట్ ఇవ్వడంతో ఇప్ుడు ఈడీ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈడీ నమోదు చేసిన  ప్రధాన నిందితులుగా సీఎం సిద్ధరామయ్య, ఆయన సతీమణి బీఎం పార్వతితో పాటు మరికొందరు కుటుంబసభ్యులు ఉన్నారరు.  ముడాలో పనిచేసిన అప్పటి కీలక అధికారుల పేర్లను కూడా ఈడీ నిందితుల జాబితాలో చేర్చింది.   అప్పట్లో ఈడీ వెల్లడించిన నివేదిక ప్రకారం సిద్ధరామయ్య భార్యకి కట్టబెట్టిన 14 సైట్లలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని తేల్చారు. ఖరీదైన స్థలాలను కాజేయడంలో భాగంగా మనీలాండరింగ్‌ ప్రయత్నాలు జరిగాయని వాదించింది. 

భూములు అప్పట్లోనే తిరిగి ఇచ్చేసిన సిద్దరామయ్య బార్య                

వివాదం వెలుగులోకి వచ్చిన తరవాత భూములన్నింటినీ సిద్ధరామయ్య భార్య తిరిగి ఇచ్చేసింది. ముడాతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నారు.   అయితే ఆ తర్వాత కూడా ఈడీ విచారణ కొనసాగించింది.  ఈ కేసులో విచారణ   సిద్దరామయ్య పదవికి గండం తీసుకు వస్తుందని కర్ణాటక రాజకీయవర్గాలు భావించాయి. అయితే విచారణకు ఆదేశించిన లోకాయుక్తనే .. ముడా వ్యవహారంలో .. ఆధారాలు లేవని చెప్పడంతో..  మొత్తం కేసు తేలిపోయినట్లయింది..                       

Also Read: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్, విజ‌య‌వాడ రూట్‌లో వెళ్లేవారికి రాయితీ ప్రకటన

 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
Tilak Runout Explanation: బౌండరీ అనుకుని నడుచుకుంటూ వెళ్లా.. ఇండోర్ రనౌట్‌పై ఎట్టకేలకు నోరు విప్పిన తిలక్
బౌండరీ అనుకుని నడుచుకుంటూ వెళ్లా.. ఇండోర్ రనౌట్‌పై ఎట్టకేలకు నోరు విప్పిన తిలక్
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Embed widget