Kanguva Movie: 'కంగువా' ఫస్ట్ హాఫ్పై ప్రొడ్యూసర్ క్రేజీ కామెంట్స్, ‘బాహుబలి’ రికార్డులు బద్దలవుతాయా?
సూర్య హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ ‘కంగువా.. త్వరలో విడుదలకు రెడీ అవుతున్నది. ఈ నేపథ్యంలో నిర్మాత జ్ఞానవేల్ రాజా మూవీ ఫస్ట్ హాఫ్ గురించి క్రేజీ కామెంట్స్ చేశారు.
Gnanavel Raja About Kanguva Movie : తమిళ స్టార్ హీరో సూర్య, శివ కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువా’. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తాజాగా దర్శకుడు శివ, నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘కంగువా’ ఫస్ట్ హాఫ్ గురించి ప్రొడ్యూసర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘కంగువా’ చూసి ఏం మాట్లాడలేకపోయా- జ్ఞానవేల్
తాను నిర్మించిన సినిమాను తొలిసారి చూసినప్పుడు ముందుగా లోపాలను చెప్తానని జ్ఞానవేల్ వెల్లడించారు. అయితే, ఈ సినిమా విషయంలో చెప్పేందుకు లోపాలు ఏవీ కనిపించలేదన్నారు. “నేను ‘కంగువా’ సినిమా ఫస్ట్ హాఫ్ చూశాను. వెంటనే హీరో సూర్య అన్నకు ఫోన్ చేసి మాట్లాడాను. నేను నిర్మించిన సినిమాను ఫస్ట్ టైమ్ చూడగానే అందులోని నెగెటివ్ విషయాలు చెప్తాను. కానీ, ‘కంగువా’ సినిమా చూసినప్పుడు నాకు ఎలాంటి నెగెటివ్ అంశాలు కనిపించలేదు. ఇదే విషయాన్ని అన్నకు చెప్పాను. తను చాలా సంతోషంగా ఫీలయ్యారు. తప్పకుండా ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో లెవల్ కు వెళ్లబోతుంది” అని జ్ఞానవేల్ చెప్పుకొచ్చారు.
"I watched #Kanguva first half & spoke with #Suriya Anna. Usually I tell flaws of the film first & then positive. But for Kanguva there is no flaws & only positives, so Suriya Anna got High. Today I'm watching full movie output"
— AmuthaBharathi (@CinemaWithAB) October 20, 2024
- Producer GnanavelRaja pic.twitter.com/CbTXnb49TL
బాహుబలి రికార్డులు ఖతం- జ్ఞానవేల్ రాజా
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత జ్ఞానవేల్ రాజా, ‘కంగువా’ సినిమా ఏకంగా రూ. 2 వేల కోట్లు వసూళు చేసే అవకాశం ఉందన్నారు. సినిమా విడుదల తర్వాత రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను చేసిందని చెప్పే ఆధారాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తానని చెప్పారు. నిజానికి రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి 2’ కూడా రూ. 2000 కోట్లు రాబట్టలేదు. కానీ, ఇప్పుడు జ్ఞానవేల్ రాజా ‘కంగువా’ విషయంలో చూపిస్తున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే ‘బాహుబలి’ రికార్డులు బ్రేక్ కావడం ఖాయం అనిపిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా 38 భాషల్లో ‘కంగువ’ విడుదల
‘కంగువా’ ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 38 భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. తమిళంలో మాత్రమే సూర్య ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పగా, ఆ వాయిస్ ను బేస్ చేసుకుని AI టెక్నాలజీ సాయంతో 38 భాషలకు డబ్బింగ్ చెప్పించారు. నవంబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. వాస్తవానికి ఈ సినిమా అక్టోబర్ 10నే విడుదలకావాల్సి ఉంది. కానీ, అదే రోజు రజనీకాంత్ ‘వేట్టయన్’ విడుదల కావడంతో, గౌరవార్థంగా ఈ మూవీ విడుదలను వాయిదా వేశారు. సూర్య కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియోగ్రీన్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా రూ.350 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
Read Also: హీరోయిజం, ఫైట్లు, డ్యాన్స్ లు చాలు - కథ, స్క్రీన్ ప్లే, తొక్కా తోలు ఎవడికి కావాలి?: నాగవంశీ