అన్వేషించండి

Naga Vamsi: హీరోయిజం, ఫైట్లు, డ్యాన్స్ లు చాలు - కథ, స్క్రీన్ ప్లే, తొక్కా తోలు ఎవడికి కావాలి?: నాగవంశీ

గత కొద్ది రోజులుగా నిర్మాత నాగవంశీ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. టికెట్ రేట్లపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన, తాజాగా సినిమా కథ, స్క్రీన్‌ ప్లే గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Naga Vamsi About Story And Screenplay: సూర్య దేవర నాగవంశీ. ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థ అధినేత. ఆయన ఏ విషయాన్నైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చెప్తారు. అదే  ఇప్పుడు ఆయనకు తల నొప్పులు తెచ్చి పెట్టింది. ఇటీవల సినిమా టికెట్ రేట్ల గురించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఫ్యామిలీ కోసం రూ. 1500 ఖర్చు పెట్టలేరా? అన్న వ్యాఖ్యలను చాలా మంది తీవ్రంగా తప్పుబట్టారు. తాజాగా సినిమా కథలు, స్క్రీన్ ప్లే గురించి  షాకింగ్ కామెంట్స్ చేశారు. నిర్మాతగా మంచి పేరున్న ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదంటూ సినీ జనాలు ఆశ్చర్యపోతున్నారు.

కథా బలం, స్క్రీన్ ప్లే తొక్కా తోలు ఎవడు అడిగాడు?

తాజాగా 'లక్కీ భాస్కర్' ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ సినిమా కథ గురించి, స్క్రీన్ ప్లే గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. కథ, కథా బలం, దాని స్క్రీన్ ప్లే, తొక్కా తోలు ఎవడు అడిగాడు? అసలు అవన్నీ ఎవడికి కావాలి?  అంటూ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. ''సినిమా చూసే విధానం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ‘సలార్’ లాంటి సినిమాను తీసుకుంటే ప్రభాస్, 30, 40 మంది విలన్స్ ను కొట్టాలని ఆడియెన్స్ భావిస్తారు. హీరోకి హై ఎలివేషన్ ఉండాలి. హీరోయిజం చూపించాలి. బాగా డ్యాన్స్ వేయాలి. మంచి ఫైట్స్ చేయాలి. కామెడీ ఉండాలి. ఇవన్నీ ఆలోచించే పెద్ద హీరోల సినిమాలకు వెళ్తాం.  వాళ్లు కోరుకున్న ఎలిమెంట్స్ ఉంటే చాలు కదా? కథ, కథా బలం, దాని స్క్రీన్ ప్లే,  తొక్కా తోలు ఎవడు అడిగాడు? అసలు అవన్నీ ఎవడికి కావాలి?” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నాగవంశీ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు నాగ వంశీకి ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అంటూ ఆడియెన్స్ తో పాటు సినీ  ప్రముఖులు చర్చించుకుంటున్నారు.  

సినిమా రివ్యూల పైనా నాగవంశీ కీలక వ్యాఖ్యలు

అటు చాలా మంది ఈ రోజుల్లో సినిమా చూడకుండానే ఓ నిర్ణయానికి వస్తున్నారని నాగవంశీ అన్నారు. సినిమా పోస్టర్, టీజర్, ట్రైలర్ ను చూసి సినిమా చూడాలా? వద్దా? అనే నిర్ణయానికి వస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో పెట్టే రివ్యూలు సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ ను డిసైడ్ చేస్తున్నాయని తెలిపారు. పది మంది నెటిజన్లలో ఐదుగురు సినిమా బాగుందని చెప్తే సినిమా సూపర్ హిట్ అయినట్లేనన్నారు. అయితే, చిన్న సినిమాలు మౌత్ పబ్లిసిటీతో మంచి సక్సెస్ అందుకుంటున్నాయని వెల్లడించారు. ప్రేక్షకులు సినిమా చూడాలి అనుకుంటే చూస్తారని చెప్పారు. ఒకటి రెండు శాతం మంది సోషల్ మీడియా రివ్యూలను చూసి ప్రభావితం అవుతారు తప్ప, మిగతావాళ్లు థియేటర్లకు వెళ్తారని చెప్పారు. కొంత మంది కావాలని సినిమాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని నాగవంశీ ఆరోపించారు.

Read Also: కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్... మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Naga Vamsi: హీరోయిజం, ఫైట్లు, డ్యాన్స్ లు చాలు - కథ, స్క్రీన్ ప్లే, తొక్కా తోలు ఎవడికి కావాలి?: నాగవంశీ
హీరోయిజం, ఫైట్లు, డ్యాన్స్ లు చాలు - కథ, స్క్రీన్ ప్లే, తొక్కా తోలు ఎవడికి కావాలి?: నాగవంశీ
Free Gas Cylinder: దీపావళి నుంచి మరో కొత్త పథకం అమలు - ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
దీపావళి నుంచి మరో కొత్త పథకం అమలు - ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
Hyderabad News: గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన, అశోక్ నగర్‌లో భారీగా మోహరించిన పోలీసులు
గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన, అశోక్ నగర్‌లో భారీగా మోహరించిన పోలీసులు
AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మరో యుద్ధానికి కాలుదువ్వుతున్న చైనా, ఈసారి పసికూనపై ప్రతాపంమసీదుకు హిందూ సంఘాలు, ముత్యాలమ్మ గుడిపై డీసీపీ సంచలన నిజాలుKTR Comments: రేవంత్ రెడ్డికి బండి సంజయ్ మద్దతు - కేటీఆర్సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఉద్రిక్తత, హిందూ సంఘాలపై లాఠీ ఛార్జ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naga Vamsi: హీరోయిజం, ఫైట్లు, డ్యాన్స్ లు చాలు - కథ, స్క్రీన్ ప్లే, తొక్కా తోలు ఎవడికి కావాలి?: నాగవంశీ
హీరోయిజం, ఫైట్లు, డ్యాన్స్ లు చాలు - కథ, స్క్రీన్ ప్లే, తొక్కా తోలు ఎవడికి కావాలి?: నాగవంశీ
Free Gas Cylinder: దీపావళి నుంచి మరో కొత్త పథకం అమలు - ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
దీపావళి నుంచి మరో కొత్త పథకం అమలు - ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
Hyderabad News: గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన, అశోక్ నగర్‌లో భారీగా మోహరించిన పోలీసులు
గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన, అశోక్ నగర్‌లో భారీగా మోహరించిన పోలీసులు
AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
Lucky Bhaskar Trailer: ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్‌ వచ్చేస్తోంది, క్రేజీ అప్ డేట్ ఇచ్చిన దుల్కర్ సల్మాన్!
‘లక్కీ భాస్కర్’ ట్రైలర్‌ వచ్చేస్తోంది, క్రేజీ అప్ డేట్ ఇచ్చిన దుల్కర్ సల్మాన్!
Crime News: ఏపీలో తీవ్ర విషాదాలు - కరెంట్ షాక్‌తో ఒకే రోజు తల్లీకొడుకు మృతి, మరోచోట రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు దుర్మరణం
ఏపీలో తీవ్ర విషాదాలు - కరెంట్ షాక్‌తో ఒకే రోజు తల్లీకొడుకు మృతి, మరోచోట రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు దుర్మరణం
Hyderabad News: చికెన్ బిర్యానీలో కప్ప ప్రత్యక్షం - ట్రిపుల్ ఐటీ మెస్‌లో కలకలం, విద్యార్థుల ఆందోళన
చికెన్ బిర్యానీలో కప్ప ప్రత్యక్షం - ట్రిపుల్ ఐటీ మెస్‌లో కలకలం, విద్యార్థుల ఆందోళన
Tirumala News: బ్లాక్‌లో తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు, వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు
బ్లాక్‌లో తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు, వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు
Embed widget