అన్వేషించండి

Emergency Movie: కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్... మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?

కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. సుమారు 13 కట్స్ తో పాటు పలు మార్పులను సూచించింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

Emergency Gets Censor Certificate: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ చిక్కుల నుంచి బయట పడింది. ఎట్టకేలకు సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) స్క్రీనింగ్ కోసం క్లియరెన్స్ ఇచ్చింది. ఈ విషయాన్ని కంగనా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ’ఎమర్జెన్సీ’ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిందని తెలిపింది. త్వరలో మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని వెల్లడించింది. ఈ సినిమా విషయంలో అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి వస్తున్న మద్దతు పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపింది. “మా సినిమా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం. మీ సపోర్టుకు ధన్యవాదాలు” అని ఎక్స్ లో వెల్లడించింది.  

సిక్కు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత

‘ఎమర్జెన్సీ’ సినిమా సెప్టెంబర్ 6న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే, ఈ చిత్రం సిక్కు సమాజాన్ని చెడుగా చూపించేలా ఉందని ఆరోపిస్తూ సిక్కు గ్రూపులు ఆందోళనకు దిగాయి. పోలీసులకు ఫిర్యాదులు చేశాయి. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేయలేదు. చిత్ర బృందం బాంబే హైకోర్టును ఆశ్రయించింది. సెన్సార్ బోర్డు  రివైజింగ్ కమిటీ సూచించిన విధంగా కీలక మార్పులు చేర్పులు చేస్తామని నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ‘ఎమర్జెన్సీ’ సినిమాకు క్లియరెన్స్ లభించింది.

13 కట్స్ తో U/A సర్టిఫికేట్‌

‘ఎమర్జెన్సీ’ సినిమాకు సెన్సార్ బోర్డు ఏకంగా 13 కట్స్ సూచించింది. సినిమాలో కొన్ని మార్పులు చేయాలని చెప్పింది. రివైజింగ్ కమిటీ మార్పులకు అనుగుణంగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ కు సూచించింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్‌ ను జారీ చేసింది. పలు హింసాత్మక సన్నివేశాలతో పాటు కొన్ని కీలక సన్నివేశాను తొలగించినట్లు తెలుస్తోంది. 13 కట్స్ అంటే సినిమాలో చాలా కీలక సన్నివేశాలను లేపేసి ఉండొచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

పంజాబ్ ఎన్నికల తర్వాతే విడుదల?

‘ఎమర్జెన్సీ’ సినిమాను పంజాబ్ ఎన్నికల తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ లో పంజాబ్ ఎన్నికలు జరగనున్నాయి. "CBFC సర్టిఫికేట్ జారీ అయిన నేపథ్యంలో... ఈ సినిమాను పంజాబ్ ఎన్నికల తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో బయట జరుగుతున్నట్లు ఓ వర్గాన్ని కించపరిచే సన్నివేశాలు ఏవీ ఉండవు. ప్రేక్షకులు తప్పకుండా చూడాలి. ఈ సినిమా ఎవరి మనోభావాలను దెబ్బతీయదు. పంజాబ్ ఎన్నికల తర్వాత ఈ సినిమాను విడుదల చేస్తే ఎలాంటి రాజకీయ ఇబ్బందులు ఉండవని భావిస్తున్నాం” అని మేకర్స్ చెప్పినట్లు తెలుస్తోంది. 

‘ఎమర్జెన్సీ’ కథ ఏంటంటే?

ఈ సినిమాను మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించింది కంగనా. జూన్ 1975 నుంచి మార్చి 1977 వరకు ఎమర్జెన్సీ కాలంలో జరిగిన ముఖ్య ఘటనల ఆధారంగా తెరకెక్కింది. కంగనా ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ మూవీలో మాజీ ప్రధాని ఇందిరా పాత్రలోనూ నటించింది.  ఈ మూవీలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మిలింద్ సోమన్, మహిమా చౌదరి, దివంగత నటుడు సతీష్ కౌశిక్ కీలక పాత్రలు పోషించారు.

Read Also: బేబీ బంప్‌తో షాక్ ఇచ్చిన 'లెజెండ్' హీరోయిన్ - త్వరలో తల్లి కానున్న రాధికా ఆప్టే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Maharashtra Elections : మహారాష్ట్రలో 2 శివసేనలు, 2 ఎన్సీపీలు - కలగాపులగా రాజకీయంలో ఫలితం ఎటు తేలుతుంది ?
మహారాష్ట్రలో 2 శివసేనలు, 2 ఎన్సీపీలు - కలగాపులగా రాజకీయంలో ఫలితం ఎటు తేలుతుంది ?
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Maharashtra Elections : మహారాష్ట్రలో 2 శివసేనలు, 2 ఎన్సీపీలు - కలగాపులగా రాజకీయంలో ఫలితం ఎటు తేలుతుంది ?
మహారాష్ట్రలో 2 శివసేనలు, 2 ఎన్సీపీలు - కలగాపులగా రాజకీయంలో ఫలితం ఎటు తేలుతుంది ?
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Moosi Project Politics :  మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ -  బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ - బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
Jio Cloud PC: చిటికేస్తే మీ ఇంట్లో టీవీ కంప్యూటర్‌ అయిపోతుంది - 'జియో క్లౌడ్‌ పీసీ'తో మ్యాజిక్‌ చేయండి
చిటికేస్తే మీ ఇంట్లో టీవీ కంప్యూటర్‌ అయిపోతుంది - 'జియో క్లౌడ్‌ పీసీ'తో మ్యాజిక్‌ చేయండి
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Embed widget