బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్ రూటే సపరేటు! ఆవిడ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ అన్నట్లు ఉంటుంది. సాధారణంగా హీరోయిన్లు ఎయిర్ పోర్టులకు వచ్చేటప్పుడు మోడ్రన్, ట్రెండీ స్టైల్స్, డ్రస్ లు వేసుకుని వస్తారు. కంగనా రనౌత్ మిగతా హీరోయిన్లలా కాదు... ఎయిర్ పోర్టుకు చక్కగా చీరలో వచ్చారు. పింక్ శారీలో ధరించిన కంగనా ముంబై ఎయిర్ పోర్టులో కనిపించిన వెంటనే... ప్రెట్టి అంటూ కాంప్లిమెంట్స్ వచ్చాయి. సెప్టెంబర్ 28న కంగనా రనౌత్ నటించిన 'చంద్రముఖి 2' థియేటర్లలో విడుదలైంది. చంద్రముఖి 2 తర్వాత 'తేజస్' సినిమాతో మరోసారి కంగనా రనౌత్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'చంద్రముఖి 2', 'తేజస్' సినిమాలు కంగనాకు ఆశించిన విజయాలు ఇవ్వలేదు. ప్రస్తుతం కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' సినిమా చేస్తున్నారు. 'ఎమర్జెన్సీ' సినిమాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్నారు. కంగనా రనౌత్ (all images courtesy : manav manglani)