News
News
X

Life Certificate Through Video Call: లైఫ్‌ సర్టిఫికెట్‌ కోసం బ్యాంక్‌ వరకు వెళ్లొద్దు, ఒక్క వీడియో కాల్‌తో సులువుగా సబ్మిట్‌ చేయవచ్చు

చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు వీడియో కాల్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్‌ సమర్పించే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

FOLLOW US: 
 
Life Certificate Through Video Call: పింఛను నిబంధనల ప్రకారం.. ప్రతి పింఛనుదారు సంవత్సరానికి ఒకసారి జీవిత ధృవీకరణ పత్రాన్ని (life certificate) సంబంధిత బ్యాంక్‌కు సమర్పించాలి. లేకపోతే, పింఛను ఆగిపోతుంది. ఒకవేళ మీరు లేదా మీ కుటుంబ సభ్యుడు లేదా బంధుమిత్రులు పింఛనర్లు అయితే... ఈ వార్త మీకు చాలా ఉపయోగపడుతుంది. 

ఏటా లైఫ్‌ సర్టిఫికెట్లను సమర్పించడం పింఛనుదార్లకు పెద్ద పని. నడవగలిగే పరిస్థితుల్లో ఉన్నవాళ్లకు ఓకే. నడవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్లకు మాత్రం అది నరకం. అయినా.. పింఛను కావాలంటే ఈ పని పూర్తి చేయక తప్పదు. అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా బ్యాంకు వరకు వెళ్లలేని పింఛనుదార్లు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉన్నారు. వీరికి ఉపశమనం కల్పిస్తూ... చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు వీడియో కాల్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్‌ సమర్పించే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

"లైఫ్‌ సర్టిఫికెట్‌ థ్రూ ఏ వీడియో కాల్‌" లిస్ట్‌లోకి, దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పేరు చేరింది. తమ కస్టమర్లకు వీడియో కాల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే సదుపాయం కల్పిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ‍‌(BoB) కూడా గతంలో ప్రకటించింది. మీరు ఈ రెండు బ్యాంకుల కస్టమర్ అయితే, వీడియో కాల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ఎలా సమర్పించాలో మేం వివరిస్తాం.

SBI కస్టమర్లు వీడియో కాల్ ద్వారా లైఫ్‌ సర్టిఫికేట్ సమర్పించే విధానం:
1. ముందుగా, పెన్షన్ సేవా యాప్ లేదా SBI అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి
2. అక్కడ 'VideoLC' బటన్‌ను క్లిక్ చేయాలి. మీ పింఛను ఖాతా నంబర్, క్యాప్చా కోడ్‌, ఆధార్ నంబర్‌ పూరించాలి.
3. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్‌ చేయాలి. తర్వాత, అన్ని బాక్స్‌లను టిక్ చేయాలి.
4. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ తర్వాత ప్రొసీడ్ బటన్‌పై క్లిక్ చేయాలి.
5. ఇప్పుడు, వీడియో కాల్ కోసం మీకు టైమ్‌ స్లాట్‌ కేటాయిస్తారు. ఒకవేళ మీకు అనుగుణంగా టైమ్ స్లాట్‌ను ఎంచుకోవడానికి, 'షెడ్యూల్ కాల్' మీద క్లిక్ చేయండి. మీకు వీలున్న ప్రకారం సమయం, తేదీ ఎంచుకోండి.
6. దీని తర్వాత మీకు ఒక నిర్ధరణ SMS, ఈ-మెయిల్ వస్తాయి.
9. వీడియో కాల్ ప్రారంభానికి 5 నిమిషాల ముందే మీరు సిద్ధంగా ఉండవచ్చు. ఇచ్చిన సమయానికి బ్యాంకు అధికారులు ఈ వీడియో కాల్‌లో జాయిన్ అవుతారు.
10. ఈ కాల్‌ తర్వాత మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌ను పొందుతారు. ఆ తర్వాత అన్ని నిబంధనలు, షరతులను టిక్ చేయాలి.
11. మీ రిజిస్టర్డ్‌ మొబైల్ నంబర్‌కు వచ్చే ధృవీకరణ కోడ్‌ను నమోదు చేయాలి. అప్పుడు కెమెరాకు మీ పాన్ కార్డ్ చూపించాలి.
12. ఆ తర్వాత కెమెరా ఆటోమేటిక్‌గా మీ ముఖాన్ని క్యాప్చర్ చేస్తుంది.
13. దీనితో పాటు, వీడియో కాల్ ద్వారా మీ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్‌ జరుగుతుంది.
14. దీని తర్వాత ఒక కన్ఫర్మేషన్‌ SMS మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తుంది.

News Reels

బ్యాంక్ ఆఫ్ బరోడా (వీడియో కాల్ ద్వారా BOB లైఫ్ సర్టిఫికేట్) ఇటీవలే ఈ ఫెలిలిటీ తెచ్చింది. తమ కస్టమర్‌లు 'లైఫ్ సర్టిఫికేట్'ని వీడియో కాల్ ద్వారా సమర్పించవచ్చని ప్రకటించింది. 31 నవంబర్ 2022 నాటికి 60 ఏళ్లు పైబడిన వారికి బ్యాంక్ ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. 

BOB కస్టమర్లు వీడియో కాల్ ద్వారా లైఫ్‌ సర్టిఫికేట్ సమర్పించే విధానం:
ముందుగా, పెన్సిల్ సారథి పోర్టల్ లేదా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ Bankofbaroda.com పై క్లిక్ చేయండి.
ఇప్పుడు, PPO నంబర్ మరియు ఖాతా నంబర్‌ను నమోదు చేయండి.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, దాన్ని ఎంటర్‌ చేయండి.
ఆధార్ నంబర్‌ ఎంటర్‌ చేసి సబ్మిట్‌ చేయండి.
ఇక్కడ, కాల్ నౌ లేదా కాల్‌ లేటర్ ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోండి.
మీ ఎంపికకు తగ్గట్లుగా బ్యాంక్ నుంచి వీడియో కాల్ వస్తుంది. BOB ఏజెంట్ మీ ముందు కనిపిస్తాడు.
అప్పుడు మీ ఫోటో ID, మిగిలిన వివరాలను ఎంటర్‌ చేయాలి.
మీ ఆధార్‌కు లింక్‌ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మళ్లీ OTP వస్తుంది.
ఆ ఓటీపీని సంబంధిత బాక్స్‌లో ఎంటర్‌ చేయండి.
ఇప్పుడు మీ లైఫ్ సర్టిఫికేట్‌ను బ్యాంకుకు సమర్పించడం పూర్తవుతుంది. దీని గురించి మీ మొబైల్‌ నంబర్‌కు కన్ఫర్మేషన్‌ SMS, ఈ-మెయిల్ వస్తాయి.

Published at : 15 Nov 2022 04:17 PM (IST) Tags: pensioners Bank of baroda life certificate State Bank Video call

సంబంధిత కథనాలు

Gold-Silver Price 03 December 2022: పోటీలు పడి మరీ షాకులిస్తున్న పసిడి, వెండి - ఒక్కసారే భారీగా పెరిగాయిగా!

Gold-Silver Price 03 December 2022: పోటీలు పడి మరీ షాకులిస్తున్న పసిడి, వెండి - ఒక్కసారే భారీగా పెరిగాయిగా!

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

Petrol-Diesel Price, 03 December 2022: ముడి చమురు పతనం ఎఫెక్ట్‌, తెలుగు నగరాల్లో బాగా తగ్గిన పెట్రోల్‌ రేటు

Petrol-Diesel Price, 03 December 2022: ముడి చమురు పతనం ఎఫెక్ట్‌, తెలుగు నగరాల్లో బాగా తగ్గిన పెట్రోల్‌ రేటు

Cryptocurrency Prices: ఎటూ లేదు! ఒడుదొడుకుల్లోనే క్రిప్టోలు - బిట్‌కాయిన్‌ రూ.10వేలు డౌన్‌

Cryptocurrency Prices: ఎటూ లేదు! ఒడుదొడుకుల్లోనే క్రిప్టోలు - బిట్‌కాయిన్‌ రూ.10వేలు డౌన్‌

Stock Market Closing: 8 రోజుల లాభాలకు కత్తెర! సెన్సెక్స్‌ 415 డౌన్‌, 18,700 వద్ద ముగిసిన నిఫ్టీ

Stock Market Closing: 8 రోజుల లాభాలకు కత్తెర! సెన్సెక్స్‌ 415 డౌన్‌, 18,700 వద్ద ముగిసిన నిఫ్టీ

టాప్ స్టోరీస్

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు  గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Viral News: మొక్కే కదా అని పట్టుకునేరు ప్రాణాలు పోతాయ్- నాగుపాము కంటే డేంజర్

Viral News: మొక్కే కదా అని పట్టుకునేరు ప్రాణాలు పోతాయ్- నాగుపాము కంటే డేంజర్

Dutee Chand With Monalisa : మోనాలిసాతో కలిసి సోదరి వివాహం చేసిన ద్యుతి చంద్ | ABP Desam

Dutee Chand With Monalisa : మోనాలిసాతో కలిసి సోదరి వివాహం చేసిన ద్యుతి చంద్ | ABP Desam

Pushpa in Russia : రష్యాలో పుష్ప ప్రమోషన్స్ లో బిజీబిజీగా అల్లు అర్జున్ అండ్ టీమ్ | ABP Desam

Pushpa in Russia : రష్యాలో పుష్ప ప్రమోషన్స్ లో బిజీబిజీగా అల్లు అర్జున్ అండ్ టీమ్ | ABP Desam