Spirituality: భగవద్గీత మొత్తం చదవలేదా అయితే ఈ శ్లోకాలు గుర్తుపెట్టుకోండి చాలు!
కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఉపదేశించిన భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాల్సిన గ్రంధం. అయితే మొత్తం చదివే అవకాశం లేనివారు ఈ శ్లోకాలు గుర్తుపెట్టుకుంటే చాలు...
Bhagavad Gita: సాక్షాత్తూ శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత. కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులని, బంధువులని, గురువులని, స్నేహితులని చూసి, హృదయం వికలమై.. రాజ్యం కోసం వారిని నేను వధించలేనని బాధపడిన అర్జునుడికి చెప్పిన బ్రహ్మజ్ఞానం భగవద్గీత. ఉరకల పరుగుల జీవనంలో మొత్తం చదివే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. అందుకే ముఖ్యమైన, ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన కొన్ని శ్లోకాలు మీకోసం...
1. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మ ఫలహేతుర్భూ: మాతే సంగోఅస్త్వకర్మణి ||
భావము: నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే. ఆ కర్మఫలాలకు అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో ఎట్టిపరిస్థితుల్లో కర్మలు చేయకు. అలాగని చేయడం మానకు అని అర్ధం.
Also Read: భగవద్గీత - సక్సెస్ ఫుల్ పర్సన్ కావాలంటే మీలో ఏ లక్షణాలు ఉండాలో తెలుసా?
2. వాసంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి|
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ||
భావము: "చిరిగిపోయిన బట్టలను పడేసి, మనం కొత్తబట్టలు ఎలా కట్టుకుంటామో.. జీర్ణమైన శరీరాన్ని వదిలిన ఆత్మ కూడా- మరోకొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది"
3. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమ
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్దినాశాత్‌ప్రణశ్యతి
భావము:కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మతిమరుపు, మరుపుతో బుద్ధినాశనం, బుద్ధినాశనంతో మనిషే నాశనం అవుతాడని అర్థం
4. తస్మాదసక్త స్సతతం కార్యం కర్మ సమాచార |
ఆసక్తో హ్యాచరన్ కర్మ పర మాప్నోతి పూరుష: ||
భావము: చేసే పని, దాని ఫలితము మీద అదే పనిగా ఆసక్తి ఉండొద్దు. కర్మ ప్రకారం చేసుకుంటూ పోవాలంతే అంటాడు శ్రీకృష్ణ భగవానుడు
5. ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ|
యథోల్యేనావఈతో గర్భస్తథా తేనేదమావృతమూ ||
భావము: పొగ చేత నిప్పు, ధూళి చేత అద్దం, మావి చేత గర్భస్త పిండం కప్పి ఉన్నట్లే, కోరికలతో జ్ఞానం కూడా కప్పి ఉంటుందని అర్ధం.
Also Read : ఈ రెండు పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవద్దని భగవద్గీత చెబుతోంది!
సాధారణంగా భగవద్గీత వింటున్నాం అని ఎవరైనా చెప్పినప్పుడు ఎందుకంత వైరాగ్యం అంటారు. కానీ భగవద్గీత అంటే వైరాగ్యం కాదు చేయాల్సిన కార్యాన్ని గుర్తుచేస్తూ కర్తవ్య నిర్వహణను సూచించే ప్రేరకం. భగవద్గీత అంటే జీవిత చరమాంకంలో కాలక్షేపం కోసం చదివే పుస్తకం కాదు...రకరకాల ఉద్రేకాల మధ్య కొట్టుకుపోతున్న యువత వాటినుంచి ఎలా బయటపడాలో చెప్పే గ్రంధం. జీవితంలో ప్రతి మలుపులోనూ ఉపయోగపడుతుంది. ఎదురయ్యే ప్రతిప్రశ్నకీ సమాధానం ఇస్తుంది. సాక్షాత్తూ శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత. కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులని, బంధువులని, గురువులని, స్నేహితులని చూసి, హృదయం వికలమై.. రాజ్యం కోసం వారిని నేను వధించలేనని బాధపడిన అర్జునుడికి చెప్పిన బ్రహ్మజ్ఞానం భగవద్గీత.
Also Read: ఈ రెండు పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవద్దని భగవద్గీత చెబుతోంది!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.