Job And Business Astrology: మీరు ఏ ఉద్యోగం, వ్యాపారంలో సక్సెస్ అవుతారో మీ నక్షత్రం చెప్పేస్తుంది!
Nakshatra And Career Choice: మీ రాశి,నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో ఉద్యోగం చేస్తే, ఎలాంటి వ్యాపారం చేస్తారో, ఏఏ ఉద్యోగాలు మీకు కలిసొస్తాయో ఇక్కడ తెలుసుకోండి
Job And Business Astrology: కొందరికి ఎన్ని ఉద్యోగాలు, వ్యాపారాలు చేసినా కలసిరాదు. ఏంటో ఎంత కష్టపడినా ఇలాగే ఉంటోందని బాధపడతారు. అయితే మీ నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో అడుగుపెడితే సక్సెస్ అవుతారో ముందుగా తెలుసుకుంటే అప్పుడు పరాజయం అనేదే ఉండదంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు..మరి మీ నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారో ఇక్కడ తెలుసుకోండి....
అశ్విని
ఈ నక్షత్రానికి చెందిన వారు ఫ్యాక్టరీ, పోలీసు, మిలటరీ, వైద్యరంగం, రైల్వే, పోస్టల్ శాఖలలో ఉద్యోగాలు కలిసొస్తాయి. మీకు మీరు స్వతంత్రంగా ఉండాలనుకుంటే ప్రైవేటు వైద్యం, ఇనుము, మందుల షాపు, కొరియర్, కలప వ్యాపారాలు చేయడం మంచిది
భరణి
ఈ నక్షత్రం వారికి సంగీతం, బట్టల మిల్లులు, భవననిర్మాణం, వాహనాలు నడపటంలో ఉద్యోగాలు చేయడం మంచిది. సొంతంగా పరిశ్రమ స్థాపించటం, థియేటర్ల నిర్వహణ, హోటల్, పశువైద్యం, గృహోపయోగ సామాగ్రి, పాలు, రసాయనాలు, రత్నాల వ్యాపారం కలిసొస్తుంది
Also Read: ఓ ప్రత్యేక వ్యక్తి ఈ రాశివారి జీవితంలో ఉత్సాహం తీసుకొస్తారు, ఫిబ్రవరి 02 రాశిఫలాలు
కృత్తిక
ఈ నక్షత్రం వారు రక్షణశాఖలు, రసాయన కర్మాగారాలు, అగ్ని సంబంధ కర్మాగారాల్లో ఉద్యోగం పొందుతారు. సొంతంగా అయితే టింబర్ డిపో, ఆయుధ తయారీ, భవన నిర్మాణ సామాగ్రి సరఫరా, ఎలక్ట్రికల్ షాపు నిర్వహణ కలిసొస్తాయి. వృషభ రాశికి చెందిన కృత్తిక వారికి నగల షాపు, ఫోటోగ్రఫీ, రెడీమేడ్ దుస్తులు, సాంస్కృతిక కార్యక్రమములు నిర్వహించుట. మెడికల్ షాపు నిర్వహణ లాంటివి బాగా కలిసొస్తాయి
రోహిణి
ఈ నక్షత్రం వారు హోటల్, బేకరీ, లాడ్జి, బట్టలు, ఉన్ని - నూలు, రవాణా, పార్లర్, నూనె ఫ్యాక్టరీల వ్యాపారం అయినా ఇందులో ఉద్యోగం అయినా కలిసొస్తుంది
మృగశిర
ఈ నక్షత్రం వారికి ఎస్టేట్లు, పురుగుల మందుల దుకాణాలు, కర్మాగారాలు, లాండ్రీలు, పొగాకు సంస్థలు, వ్యవసాయం, సినిమా ధియేటర్, ఆటోమొబైల్, ఇంజనీరింగ్, బ్రాందీ షాపులు, పండ్లు పూల దుకాణాలు, తోలు వస్తువులు తయారుచేసే ఫ్యాక్టరీల్లో ఉద్యోగం, వ్యాపారం బావుంటుంది. మిథున రాశికి చెందిన మృగశిర వారికి స్పేర్ పార్టులు, ఎలక్ట్రికల్ వస్తువులు, మందుల తయారీ, బేకరీ, టెలిఫోన్, వైర్లెస్ సమాన్లు తయారు చేసే వృత్తి వ్యాపారాలు ఎక్కువగా చేస్తారు
Also Read: మకరంలోకి కుజుడు - ఈ 5 రాశులవారికి మంచిరోజులొచ్చినట్టే!
ఆరుద్ర
యాడ్ బిజినెస్, మెడికల్ షాపు, ఫైనాన్స్, టి.వి. రేడియో షాపులు, పోస్టల్ & టెలిగ్రాఫ్, పురుగుమందులు, న్యూస్ పేపరు ఏజెన్సీలో పనిచేయడం మీకు శుభకరం
పునర్వసు
ఈ నక్షత్రానికి చెందినవారు జ్యోతిష్యం, రచనా వ్యాసంగం, పత్రికా నిర్వహణ, ఇంజనీరింగ్, కమీషన్ రంగం, విద్యాబోధన, ఇన్సూరెన్స్, పోస్టల్ శాఖ, రాయబార కార్యాలయాలు, రాజకీయాల్లో వెలుగుతారు. కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్ర జాతకులు ఫైనాన్స్, దేవాలయం, మత సంబంధ వృత్తులు వైద్యం, నీటి పారుదల శాఖ, బ్యాంకులు షిప్పింగ్ ఏజెన్సీలలో ఉద్యోగ వ్యాపారాలు చేస్తారు.
Also Read: ఈ రాశులవారికి ఫిబ్రవరి నెల చుక్కలు చూపిస్తుంది, నెలాఖరు కొంత ఉపశమనం
పుష్యమి నక్షత్రం
కార్పోరేషన్ , ఇంజనీర్, పెట్రోలు బంక్, బ్లడ్ బ్యాంకు, ఉన్ని షాపులు , త్రవ్వకపు సంస్థల్లో ఉద్యోగ, వ్యాపారాలు చేస్తారు
ఆశ్లేష
ఈ నక్షత్ర జాతకులు ప్రింటింగ్ ప్రెస్ , కళారంగం, లాటరీషాపులు, సినిమా ధియేటర్లు , బట్టల మిల్లులు, ట్రావెల్ ఏజెన్సీ నిర్వహణ ఎక్కువగా కలిసొస్తాయి
ఇన్ని వృత్తులలోనూ, ప్రతివృత్తిలో స్థాయీ భేదం ఉంటుంది. అత్యున్నత స్థాయి, ఉన్నతస్థాయి మధ్యమస్థాయి, అధమస్థాయి ఉంటాయి. ఎంతమేర జాతకుడు స్థాయిని పొందగలడు అనేది వారి లగ్నాధిపతి ఆధారంగా ఉంటుంది.
తర్వాత నక్షత్రాలకు సంబంధించిన సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి....
గమనిక: ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.